/rtv/media/media_files/2025/11/07/pm-modi-2025-11-07-14-49-14.jpg)
Important stanzas of Vande Matram dropped in 1937, Says PM Modi
వందేమాతరం జాతీయ గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంస్మరణ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 1937లో వందేమాతరం గీతంలో కొన్ని ముఖ్యమైన చరణాలు తొలగించినట్లు ఆరోపించారు. విభజనకు సంబంధించిన కొన్ని చరణాలు ఆ గేయం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. విభజన మైండ్‌సెట్ దేశానికి సవాల్‌గా మారిందని చెప్పారు. వందేమాతరం 150 ఏళ్లకు చెందిన సంస్మరణ స్టాంపు, నాణాన్ని ఆయన విడుదల చేశారు.
Also Read: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
'' భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం గీతం దేశ స్వరంగా మారింది. 1937లో ఈ గేయంలో కొన్ని చరణాలను తొలగించారు. ఇదే దేశ విభజనకు కారణం అయ్యింది. జాతి నిర్మాణం కోసం రూపొందించిన ఈ గీతానికి ఎందుకు అన్యాయం చేశారో ఈ తరం యువత తెలుసుకోవాలి. ఇలాంటి విభజన మైండ్ సెట్ ఇప్పటికీ దేశానికి సవాలే. ఉగ్రవాదం పేరుతో శత్రువులు భద్రత, గౌరవంపై దాడి చేస్తే అప్పుడు దేశం దుర్గ అవతారాన్ని ఎత్తింది. దీన్ని ప్రపంచ దేశాలు చూశాయి.
Also Read: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య.. 100కు పైగా విమానాలు ఆలస్యం
వందేమాతర గీతం కొత్త స్పూర్తిని ఇస్తుంది. ఇది ఓ శక్తి, కళ, పట్టుదల. భారతమాత పట్ల భక్తికి ఈ గీతమే నిదర్శనం. మన చరిత్రకు ఇది కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని'' ప్రధాని మోదీ అన్నారు. మరోవైపు వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్వహించింది. 1875, నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ దీన్ని రచించారు. ఇది ఆయన రాసిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది.
Also Read: బాంబులు పెట్టానంటూ బెదిరింపు కాల్స్.. కట్ చేస్తే విఫల ప్రేమికురాలు
Follow Us