/rtv/media/media_files/2025/09/01/mp-2025-09-01-07-35-08.jpg)
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సరిహద్దుల్లో చొరబాట్లు అరికట్టడంలో అమిత్ షా విఫలమైతే, 'మొదట ఆయన తల నరికి టేబుల్ మీద పెట్టాలి' అని ఆమె చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పదంగా మారాయి. దీంతో ఆమెపై ఓ స్థానిక వ్యక్తి ఫిర్యాదు మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ కేసుపై స్పందించారు. ఇడియట్స్ కు ఇడియమ్స్ (జాతీయాలు)అర్థం కావని ఆమె అన్నారు. బెంగాలీలో తాను అన్న మాటలకు అర్థం వేరు అని ఆమె అన్నారు. సరిహద్దుల్లో బంగ్లాదేశీ చొరబాటుదారులను నియంత్రించడంలో జవాబుదారీతనం ఉండాలన్న తన కామెంట్స్ ను వక్రీకరించారని ఆమె తెలిపారు. గూగుల్ ట్రాన్స్ లేట్ వాడితే ఇలాగే ఉంటుందని రాష్ట్ర పోలీసులపై ఆమె ఫైర్ అయ్యారు. మీరు గూగుల్ ట్రాన్స్‌లేట్ ఉపయోగించి బెంగాలీ నుండి ఇంగ్లీషులోకి, ఇంగ్లీషు నుండి హిందీలోకి పదాలను అనువదించి నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసినప్పుడు ఇలాగే జరుగుతుందన్నారు.
Hello @RaipurPoliceCG this one’s for you. Be careful with filing fake cases. Courts see through them & then heads will roll. pic.twitter.com/ibLjPD5bGl
— Mahua Moitra (@MahuaMoitra) August 31, 2025
Also Read : Recording Dance : వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు..VIDEOS వైరల్
మొయిత్రా వ్యాఖ్యలు ప్రజాస్వామ్య సంస్థలను అవమానించేలా ఉన్నాయని, ద్వేషాన్ని వ్యాప్తి చేసేలా ఉన్నాయని, జాతీయ ఐక్యతకు ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ స్థానిక నివాసి గోపాల్ సమంటో దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆదివారం రాయ్‌పూర్‌లో లోక్‌సభ ఎంపీపై కేసు నమోదైంది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులను మొయిత్రా తీవ్రంగా విమర్శించారు.
Also Read : Crime News: షాకింగ్.. గణపతి నిమజ్జనంలో అపశ్రుతి.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి!
అది ఎవరి తప్పు?
కాగా వెస్ట్ బెంగాల్‌లో అక్రమ చొరబాటుకు సంబంధించి ఎంపీ మంగళవారం సంచలన కామెంట్స్ చేశారు. నదియా జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న అక్రమ చొరబాట్ల గురించి మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదేపదే చొరబాటుదారులు అని చెబుతున్నారు. ఒకవేళ సరిహద్దుల గుండా రోజూ లక్షల మంది మన దేశంలోకి చొరబడుతుంటే, అది ఎవరి తప్పు అంటూ ఆమె ప్రశ్నించారు. ఒకవేళ దేశ సరిహద్దులను రక్షించడంలో హోంమంత్రిత్వ శాఖ విఫలమైతేముందుగా అమిత్ షా తల నరికి ప్రధాని నరేంద్ర మోదీ టేబుల్ మీద పెట్టాలంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా మహువా మొయిత్రా గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై, అలాగే మాంసాహారంపై నిషేధం వంటి అంశాలపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి.
Also Read : LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!