TS: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉట్నూరు ఏఎస్పీగా కాజల్, ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా ఎస్‌. చిత్తరంజన్‌ ను నియమించారు. 

New Update
CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

తెలంగాణలో కామారెడ్డి, ఆసిఫాబాద్, భద్రాచలంతో పాటూ మరి కొన్ని ప్రాంతాల ఐపీఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌లను ట్రాన్సఫర్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. మొత్తం తొమ్మిది జిల్లాల ఎస్సీలను బదిలీ చేశారు.

బదిలీ అయిన అధికారులు... 

ఉట్నూరు ఏఎస్పీగా కాజల్ 
ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా ఎస్‌. చిత్తరంజన్‌
కామారెడ్డి ఏఎస్పీగా బి.చైతన్యరెడ్డి
జనగామ ఏఎస్పీగా పి.చేతన్ నితిన్
భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్ కుమార్ సింగ్
కరీంనగర్ రూరల్ ఏఎస్పీగా ఎన్.శుభం ప్రకాష్
నిర్మల్ ఏఎస్పీగా రాజేష్ మీనా
దేవరకొండ ఏఎస్పీగా పి.మౌనిక
భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్ రెడ్డి‌

Also read: అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్, ప్రయోగం వాయిదా.. ఇస్రో కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు