Nitish Kumar: ''మీ నాన్న వల్లే ఎదిగారు''.. తేజస్వీ యాదవ్‌పై నితీశ్‌ ఫైర్

బీహార్‌ సీఎం నితీశ్ కుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ రాజకీయాల్లో తనవల్లే ఎదిగారన్నారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించిన తేజస్వీ యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా స్పందించారు.

New Update
CM Nitish Kumar and Tejaswi yadav

CM Nitish Kumar and Tejaswi yadav

బీహార్‌ సీఎం నితీశ్ కుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌ రాజకీయాల్లో తనవల్లే ఎదిగారన్నారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించిన లాలూ కొడుకు తేజస్వీ యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీహార్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. తన హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం నితీశ్‌ కుమార్‌ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. 

Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎన్డీయే నేతృత్వంలో తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తోందని అన్నారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. ఆయనకు అడ్డు తగిలారు. బీహార్‌కు ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే నితీశ్‌ కుమార్‌.. తేజస్వీపై మండిపడ్డారు. '' గతంలో బిహార్‌ ఎలా ఉండేదో నీకు గుర్తుందా ?. సాయంత్రం అయ్యిందంటే ఎవరూ బయటకు వచ్చేవాళ్లు కాదు. నువ్వు అప్పుడు చిన్న పిల్లాడివి. నేను ఏం చేశానో మీ తండ్రిని అడుగు. మీ నాన్న ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి నేనే కారణం. లాలూకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని మీ కులం వాళ్లే వ్యతిరేకించేవారు. అయినా కూడా ఆయనే నేను మద్దతు ఇచ్చానని'' నితీశ్ కుమార్ అన్నారు. 

Also Read: అసెంబ్లీలో గుట్కా నమిలి ఉమ్మిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్

దీనికి తేజస్వీ యాదవ్ స్పందిచారు. '' నేను ప్రస్తుత బీహార్‌ పరిస్థితి గురించి అడిగితే మీరు 2005కు ముందు నాటి బీహార్ చరిత్ర చెబుతున్నారు. నితీశ్ చెప్పేదాన్ని చూస్తే 2005కు ముందు బీహార్‌ ఉనికే లేదంటారా ?. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం గందరగోళంలో ఉంది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి గతంలో ఇచ్చిన హామీలే మళ్లీ రిపీట్ చేస్తున్నారంటూ'' తేజస్వీ యాదవ్‌ విమర్శలు చేశారు . 

Also Read: 'మీరు పెంచితే మేము పెంచుతాం'.. అమెరికాకు చైనా షాక్

Advertisment
తాజా కథనాలు