China: 'మీరు పెంచితే మేము పెంచుతాం'.. అమెరికాకు చైనా షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్.. టారిఫ్‌లను 20 శాతం పెంచుతూ చైనాకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డ్రాగన్‌ కూడా గట్టిగా బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా 10 నుంచి 15 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది.

New Update
xi jinping and Trump

xi jinping and Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్.. టారిఫ్‌లను 20 శాతం పెంచుతూ చైనాకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డ్రాగన్‌ కూడా యూఎస్‌కు గట్టిగా బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా 10 నుంచి 15 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధమైంది. సోయాబీన్, పోర్స్‌ వంటి ఉత్పత్తులపై 10 శాతం.. మొక్కజొన్న, పత్తి, చికెన్‌ వంటి ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటన చేసింది. మార్చి 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.

Also Read: ట్రంప్‌ నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనది: వారెన్‌ బఫెట్‌!

ఇప్పటికే చైనా ఉత్పత్తులపై ట్రంప్‌ 10 శాతం సుంకాలు విధించగా.. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచేశారు. ఇందుకు సంబంధించి కార్యనిర్వహక ఉత్తర్వులపై కూడా ఆయన సంతకం చేశారు. ఫెంటనిల్‌ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో బీజింగ్‌ చైనా విఫలమయ్యిందని ట్రంప్ అన్నారు. అందుకే తాము టారిఫ్‌లను రెట్టింపు చేసే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. 

Also Read: మా జోలికి వస్తే...అమెరికాకు కిమ్‌ సోదరి వార్నింగ్‌!

ఇదిలాఉండగా.. కెనడా, మెక్సికో దిగుమతులపై కూడా ట్రంప్ ప్రభుత్వం 25 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. అయితే సుంకాల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ట్రంప్ తెలిపారు. మార్చి 4 నుంచి అవి యథావిధిగా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే కెనడా కూడా అమెరికాపై సుంకాలు విధించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆల్కహల్, పండ్లతో పాటు 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25 శాతం సుంకం విధిస్తున్నట్లు పేర్కొంది. మంగళవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని కెనడా ప్రధాని ట్రూడో తెలిపారు. మరోవైపు ట్రంప్‌ సుంకాల వల్ల అమెరికాలో స్టాక్‌ మార్కెట్లు కుదేలైపోయాయి. అంతేకాదు దీని ఎఫెక్ట్ ఆసియా- పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లపై కూడా పడింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు