America: వలసదారులపై అమెరికా ఉక్కుపాదం.. 2,200 మంది అరెస్ట్‌

అమెరికాలో ఒక్క రోజులోనే 2,200 మంది వలసదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో వలసదారులను అరెస్టు చేయడం ఇదే మొదటిసారి. ట్రంప్‌ సహాయకులు స్టీఫెన్‌ మిల్లర్‌, హోమ్‌ ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్‌ ఐసీఈకు ఆదేశాలు జారీ చేశారు.

New Update
Telangana: యువతితో అసభ్యంగా ప్రవర్తించిన కండక్టర్‌ అరెస్ట్‌!

arrest

అమెరికాలో వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో వలసదారులను అరెస్టు చేస్తున్నారు. ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఒకే  రోజు అమెరికాలో ప్రవేశించిన 2,000 మందికి పైగా వలసదారులను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే ట్రంప్‌ సహాయకులు స్టీఫెన్‌ మిల్లర్‌, హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నియోమ్ ఐసీఈ అధికారులకు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

ఇది కూడా చూడండి:Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

పత్రాలు లేని వారి దగ్గర..

రోజుకి 3,000 మంది వలసదారులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఎవరెవరి దగ్గర అయితే పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారో వారిని అరెస్టు చేస్తున్నారు. వీరి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకపోతే పర్లేదు. అయినా కూడా వీరిని యాంకిల్‌ మానిటర్లు, స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లు, ఇతర జియోలొకేషన్‌ పరికరాలతో గమనిస్తారు. వీరు కూడా డైలీ ఐసీఈ కేంద్రాల్లో హాజరు కావాల్సి ఉంటుంది. 

ఇది కూడా చూడండి:Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

Advertisment
తాజా కథనాలు