బాలరాముడికి భారీగా విరాళాలు.. అయోధ్య రామమందిరం ఆదాయం దేశంలోనే

కుంభమేళా సందర్భంగా అయోధ్య రామమందిరానికీ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో దేవాలయం ఆదాయం కూడా భారీగా పెరిగుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 2024-25లో బాలరామునికి సమర్పించిన విరాళల విలువ రూ.750-850 కోట్లు ఉండవచ్చని ప్రొఫెసర్ వినోద్ శ్రీవాస్తవ అంచానా వేశారు.

author-image
By K Mohan
New Update
ayodhya

ayodhya Photograph: (ayodhya)

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వెళ్లిన భక్తులు అమోధ్యలోని రామమందిరాన్ని కూడా దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య బాలరాముడి మందిరానికి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతోపాటు ఆలయానికి కానుకల రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరిగింది. ప్రస్తుతం అయోధ్యలో భక్తులు, పర్యాటకుల సంఖ్య రోజుకు 2 -5 లక్షల మధ్య కొనసాగుతున్నది. ఈ క్రమంలో వచ్చిన వారికి దర్శనం, వసతి కల్పించడం సవాల్‌గా మారింది. ఈ ఏడాది సంక్రాంతి నుంచి భక్తుల తాకిడి కొనసాగుతున్నది. ఆలయ ట్రస్ట్ కార్యాలయం ఇన్‌చార్జి ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. ట్రస్ట్ పది విరాళాల కౌంటర్లలో ప్రతిరోజూ రూ.10 లక్షల విరాళాలు వస్తున్నాయని తెలిపారు.

Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్

దేవున్ని దర్శించుకున్న భక్తులు వెండి, బంగారం హుండీలో సమర్పిస్తున్నారు. దేశంలో పది ప్రముఖ హిందూ ఆలయాల్లో అయోధ్య రామ మందిరం మూడోస్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ ఎకనామిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ వినోద్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఒక అధ్యయనం ప్రకారం.. 2024-25 సంవత్సరంలో ఏపీలోని తిరుమల వేంకటేశ్వర ఆలయం వార్షిక విరాళాల మొత్తం సుమారు రూ.1500 నుంచి రూ.1650 కోట్లని తెలిపారు. తర్వాత కేరళలో తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయం కాగా.. మూడో స్థానంలో అయోధ్య రామ మందిరమే ఉందని చెప్పారు. బలరాముని వార్షక ఆదాయం రూ.750 కోట్ల నుంచి రూ.850 కోట్లు ఉండొచ్చని అంచనా. వీటితోపాటు పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం, జమ్మూలోని వైష్ణోదేవి, మహారాష్ట్రలోని షిరిడి, ఒడిశాలోని పూరీజగన్నాథ్, ఢిల్లీలోని స్వామి నారాయణ్ అక్షరధామ్, గుజరాత్ సోమ్ నాథ్ ఆలయాలకు కానుకల ద్వారా వచ్చే ఆదాయం బానే వస్తోందని శ్రీవాస్తవ అన్నారు. 

Also Read: పార్లమెంటులో అబద్ధాలు.. ఎంపీకి రూ.9లక్షల జరిమానా

Advertisment
Advertisment
తాజా కథనాలు