Singapore: పార్లమెంటులో అబద్ధాలు.. ఎంపీకి రూ.9లక్షల జరిమానా

సింగపూర్‌లో భారతి సంతతి నేత ప్రీతమ్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పార్లమెంటులో అబద్ధాలు చెప్పారనే అభియోగాలు రుజువయ్యాయి. దీంతో స్థానిక కోర్టు ప్రీతమ్‌ సింగ్‌కు 14 వేల సింగపూర్ డాలర్లు (రూ.9 లక్షలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

New Update
Pritam Singh

Pritam Singh

సింగపూర్‌లో భారతి సంతతి నేత ప్రీతమ్ సింగ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయన పార్లమెంటులో అబద్ధాలు చెప్పారనే అభియోగాలు రుజువయ్యాయి. దీంతో స్థానిక కోర్టు ప్రీతమ్‌ సింగ్‌కు 14 వేల సింగపూర్ డాలర్లు (రూ.9 లక్షలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆయన సింగపూర్ వర్కర్స్‌ పార్టీ విపక్ష నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శిక్ష వల్ల పార్లమెంటు సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు!

ఇక వివరాల్లోకి వెళ్తే.. 2021లో సింగపూర్‌ వర్కర్స్‌ పార్టీకి చెందిన మాజీ సభ్యురాలు రయీసా ఖాన్‌పై ప్రీతమ్‌ పార్లమెంటులో అబద్ధాలు చెప్పారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రివిలేజెస్‌ కమిటీ విచారణ ప్రారంభించింది. కమిటీ ముందు విచారణకు వచ్చిన ప్రీతమ్.. రెండుసార్లు తప్పుడు వాంగ్మూలం ఇచ్చినట్లు అభియోగాలు వచ్చాయి. దీనిపై 4 నెలల క్రితం విచారణ ప్రారంభమైంది. 

Also Read: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!

అయితే రెండు అభియోగాల్లో ప్రీతమ్‌పై నేరం రుజువు కావడం వల్ల కోర్టు ఒక్కో కేసులో 7 వేల సింగపూర్‌ డాలర్ల జరిమానా విధించింది. సింగపూర్‌ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే ఏదైనా కేసులో ఎంపీకి ఏడాది పాటు జైలుశిక్ష, లేదా 10 వేల సింగపూర్‌ డాలర్లు జరిమానా పడితే ఎంపీ సభ్యత్వం కోల్పోతారు. కానీ ప్రీతమ్‌కు ఒక్కో కేసులో గరిష్ఠంగా 7 వేల డాలర్లు పడింది. దీంతో ఆయన ఎంపీ సభ్యత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఎన్నికల విభాగం తెలిపింది. ఒక కేసులో మాత్రమే గరిష్ఠ జరిమానాను పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. తీర్పు అనంతరం ప్రీతమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. 

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు