Bihar Elections: బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా జేఎంఎం? ఆరుస్థానాల్లో అభ్యర్థులు

బీహార్ ఎన్నికల వేళ అక్కడి రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇండియా కూటమిలో భాగస్వామి అయిన జేఎంఎం పార్టీ ఈ సారి మాత్రం ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఆరు స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. 

New Update
HEMANTH SOREN

ఇండియా కూటమి నుంచి నెమ్మదిగా ఒక్కో పార్టీ బయటకు వచ్చేస్తున్నాయి. ఈసారి జేఎంఎం వంతు అని చెబుతున్నారు. బీహార్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలనుకోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటించింది. ఎన్నికల తర్వాత ఆర్జీడీతో పొత్తు గురించి ఆలోచిస్తామని చెప్పింది. 

ఇప్పటికి ఆరు స్థానాలు..

బీహార్‌లో ఆరు స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టనున్నామని జెఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని..చకై, ధమ్దహా, కటోరియా (ఎస్టీ), మణిహరి (ఎస్టీ), జముయి, పిర్పైంటి (ఎస్సీ) ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఇవి కాకుండా మరిన్ని సీట్లో పోటీ చేస్తుందా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా..తాము ఈ విషయం గురించి చర్చిస్తున్నామని...సీట్ల సంఖ్య 10కి పెరగవచ్చని భట్టాచార్య సమాధానం ఇచ్చారు. ప్రతిచోటా పరిస్థితి భిన్నంగా ఉంది. కాంగ్రెస్ ఆర్జేడీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేస్తోంది? సీపీఐ వీఐపీకి వ్యతిరేకంగా ఎందుకు పోటీ చేస్తోంది? ఎన్నికల వ్యూహాలు మారుతున్నాయి అన్నారు. 

బీహార్ ఎన్నికల్లో సీట్ల గురించి కాంగ్రెస్ మైకమాండ్‌ను సంప్రదించామని..తమకు గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు కేటాయించకపోతే...పార్టీ స్వంత నిర్ణయం తీసుకుంటుందని భట్టాచార్య తెలిపారు. సంకీర్ణంలో మిత్రపక్షంగా ఎన్నికలకు 12 సీట్లు కావాలని JMM డిమాండ్ చేసింది. మేము పోరాడతాము, గెలుస్తాము మరియు JMM లేకుండా, బీహార్‌లో ఎటువంటి ప్రభుత్వం ఏర్పడకుండా చూసుకుంటాము అన్నారు. ప్రస్తుతం ఎన్నకల్లో పోటీ చేసే స్థానాలతో పాటూ 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా ప్రకటించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి మేమంత్ సోరెన్(hemant-soren) నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఇతర స్టార్ క్యాంపెయినర్లలో ముఖ్యమంత్రి భార్య, గండే ఎమ్మెల్యే కల్పనా సోరెన్, దుమ్కా శాసనసభ్యుడు బసంత్ సోరెన్, పార్టీ సీనియర్ నాయకులు స్టీఫెన్ మరాండి, సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారు.

Also Read: No King Protest: ట్రంప్ అధ్యక్ష పదవికి గండం? వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి..

Advertisment
తాజా కథనాలు