Crime : మరణించిన మానవత్వం.... బైక్‌పై భార్య మృతదేహం తరలింపు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మరణించిన తన భార్య  మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో బైక్‌కు కట్టి  తరలించేందుకు సిద్ధపడ్డాడు.

New Update
Wife's body being transported on a bike

Wife's body being transported on a bike

మహారాష్ట్ర(Maharashtra) లోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మరణించిన తన భార్య  భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం, సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో నిస్సహాయ స్థితిలో డెడ్‌బాడీని బైక్‌కు కట్టి  తరలించేందుకు సిద్ధపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన డియోలాపర్ పోలీసు స్టేషన్‌ పరిధి మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.

Also Read :  కమల్ హాసన్ తల నరికేస్తా.. ఆ నటుడు సంచలన హెచ్చరిక

Wife's Body Being Transported On A Bike

వివరాల ప్రకారం... రక్షాబంధన్‌(Raksha Bandhan) వేళ తన సోదరులకు రాఖీ కట్టెందుకు ఆ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరింది. ఆ భార్యాభర్తలు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ, జాతీయ రహదారిపై బైక్‌పై వెళుతున్నారు. ఇంతలో  మృత్యురూపంలో వచ్చిన  ఒక ట్రక్కు వారి బైక్‌ను బలంగా ఢీకొంది. ఘటనా స్థలంలోనే భార్య కన్నుమూసింది. గాయపడ్డ భర్త భార్య మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ప్రమాదం జరిగిన విషయం తెలుసో తెలియదో కానీ, పోలీసులు కూడా అక్కడికి రాలేదు. దీంతో ఆమె మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు సాయం చేయాలంటూ ఆ మార్గంలో వెళుతున్నవారినందరినీ ఆమె భర్త అభ్యర్థించాడు. అయితే మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.  

 మధ్యప్రదేశ్‌లోని సియోనికి చెందిన అమిత్ యాదవ్, గ్యార్సి అమిత్ యాదవ్ దంపతులు గత 10 సంవత్సరాలుగా నాగ్‌పూర్ సమీపంలోని లోనారాలో నివసిస్తున్నారు. రక్షాబంధన్ రోజున అమిత్ తన భార్యతో కలిసి లోనారా నుండి కరణ్‌పూర్‌కు బయల్దేరాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో  ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్యార్సి అమిత్ యాదవ్‌ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆమె భర్త అమిత్‌ యాదవ్‌ సహాయం కోసం కనిపించిన అందరినీ ప్రాధేయపడ్డాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో అమిత్ తన భార్య మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనం వెనుక భాగానికి తాళ్లతో కట్టుకొని మధ్యప్రదేశ్‌లోని తమ స్వగ్రామానికి బయలుదేరాడు.  బైక్‌పై భార్య మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యాన్ని ఎవరో కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ దృశ్యాన్ని చూసినవారంతా తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అమిత్ భార్య మృతదేహాన్ని మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్తున్న దృశ్యాన్ని చూసి చాలా మంది అతని బైక్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అమిత్‌ అందుకు నిరాకరిస్తూ, బైక్‌ను ముందుకు పోనిచ్చాడు.  హైవే పోలీసులు కూడా అమిత్‌ వాహనాన్ని గమనించి, ఆపమని కోరారు. అయినా అమిత్‌ వారి మాటను లేక్కచేయలేదు. కొంతదూరం వరకూ పోలీసులు అతని బైక్‌ను వెంబడిస్తూ ఎట్టకేలకు బైక్‌ను ఆపించారు. అనంతరం పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి తరలించారు. అలాగే అమిత్‌కు తగిన సాయం అందిస్తామని హామీనిచ్చారు. ఈ ఘటన ప్రస్తుత కాలంలో మంటగలిసిన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది.ఈ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ కాగా.. వాహనదారులపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.

ఇది కూడా చూడండి: New Tax Bill: నేడే లోక్ సభలో కొత్త పన్ను బిల్లు.. ప్రైవేట్ ఉద్యోగులకు భారీ ఉపశమనం

nagapur-highway | maharastra-police | road accident | national news in Telugu | telugu-news | latest-telugu-news | telugu crime news

Advertisment
తాజా కథనాలు