Radhika Yadav: నన్ను ఉరి తీయండి..టెన్నిస్ ప్లేయర్ తండ్రి సంచలన వ్యాఖ్యలు

హరియాణాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ ను తండ్రి దీపక్‌ యాదవ్‌ హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే కూతురుపై కోపంతో ఆవేశంలో కుమార్తెను కాల్చి చంపిన దీపక్ ఇప్పుడు కుమిలిపోతున్నారని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు.

New Update
Tennis player murder

Tennis player murder

Radhika Yadav: హరియాణాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారిణి రాధికా యాదవ్‌ ను తండ్రి దీపక్‌ యాదవ్‌ హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కూతురుపై కోపంతో ఆవేశంలో కుమార్తెను కాల్చి చంపిన దీపక్ ఇప్పుడు కుమిలిపోతున్నారని అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయపై దీపక్ సోదరుడు విజయ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

Also Read: Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!

‘నేను దీపక్‌ వెంట పోలీసు స్టేషన్‌లో ఉన్నప్పుడు అతడు ఎంతో పశ్చాత్తాపంతో ఉన్నాడు. ‘నన్ను ఉరితీసే విధంగా ఎఫ్‌ఐఆర్‌ రాయండి’ అని పోలీసులకు చెప్పాడు. నేను ఆడపిల్లను చంపేశానంటూ రోదించాడు’’ అని విజయ్ వెల్లడించారు. ప్రస్తుతం దీపక్‌ను రెండువారాల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.

Also Read: COOLIE Monica Song: రజినీకాంత్ ‘కూలీ’ నుంచి పూజాహెగ్డే ఊరమాస్ సాంగ్.. గూస్‌బంప్స్ స్టెప్పులతో రప్పా రప్పా

రాధికా యాదవ్‌ హత్యకేసులో ఎన్నో కోణాలు వెలుగు చూస్తున్నాయి. తన సంపాదనపై ఆధారపడి బతుకుతున్నారంటూ కుమార్తె తరచుగా అవహేళన చేయడంతోనే తండ్రి ఈ హత్యకు పాల్పడ్డారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారు మాత్రం వాటిలో వాస్తవం లేదని చెబుతున్నారు. రాధిక గతేడాది ఓ అర్టిస్ట్‌తో కలిసి మ్యూజిక్‌ రీల్స్‌ చేసింది. ఈ ఉదంతం వారి కుటుంబంలో చిచ్చు రేపినట్లుగా వారు చెబుతున్నారు. అలాగే రాధిక టెన్నిస్‌ అకాడమీని నిర్వహించడం కూడా తండ్రికి ఇష్టం లేకపోవడమే వారిద్దరి మధ్య ఘర్షణకు కారణమని అంటున్నారు. టెన్నిస్‌ అకాడమీని మూసివేయాలని దీపక్‌ అనేకసార్లు కోరినట్టు తెలుస్తోంది. అయితే, అందుకు ఆమె నిరాకరించిందని, రూ.2 కోట్లు ఖర్చు చేసి నేర్చుకున్న కెరీర్‌ను వదులుకోమని చెప్పడం సమంజసం కాదని వాదించిందని కథనాలు వినవస్తున్నాయి.

Also Read: HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!

కాగా, హర్యానాలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ తన తండ్రి దీపక్ యాదవ్ చేతుల్లో దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్న తండ్రే కూతురిని తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో దారుణంగా కాల్చి చంపేశాడు.పోలీసులు తండ్రి దీపక్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. రాధిక టెన్నిస్ అకాడమీ నడపడం ఇష్టం లేకనే హత్యకు పాల్పడినట్లు తండ్రి ఒప్పుకున్నాడు. అయితే ఆమె సోషల్ మీడియాలో చురుకుగా ఉండటం, ఆమె ఆదాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తరచుగా అవహేళన చేయడం వంటి ఇతర కారణాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.  

Also Read: మర్డర్ కేసు.. జనసేన నేత వినుత, చంద్రబాబు అరెస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు