ఇద్దరు పిల్లలను బావిలో తోసేసిన తండ్రి.. ఆ తర్వాత దారుణం
దసరా పండుగ వేళ కామారెడ్డి జిల్లా నందివాడలో తీవ్ర విషాదం జరిగింది. చిట్టపు శ్రీనివాస్ తన ఇద్దరు కుమారులు విగ్నేష్, అనిరుధ్లను రాత్రి సమయంలో బావిలో తోసి చంపేశాడు. ఆపై తాను కూడా బావిలో పడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.