/rtv/media/media_files/2025/02/28/AiU9V9BJs3Swajn93hbr.jpg)
Gujarat Road Accident
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిర్‌గఢ్ తాలూకాలోని కునియా గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: 15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
బస్సు - కారు
రాజస్థాన్ రాష్ట్ర రవాణా సంస్థ (RSRTC) బస్సు హైవేపై రాజస్థాన్‌లోని సిరోహి వైపు వెళుతోంది. అదే సమయంలో బొలెరో SUV కారు అదే రోడ్డులో రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండటంతో SUVలో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
Also Read: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
ఒకే కుటుంబానికి చెందిన వారు
అందులో ఒక జంట, వారి ఇద్దరు కుమారులు సహా మరో వ్యక్తి ఉన్నారు. వారిని దిలీప్ కొడిటియా (32), అతని భార్య మేవాలి (28), కుమారులు రోహిత్ (6), రిత్విక్ (3), మరో వ్యక్తి సుందరి భాగ సోలంకి (60)గా గుర్తించారు. అదే సమయంలో బస్సులో ఉన్న తొమ్మిది మంది ప్రయాణీకులు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న మృతులను బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. కారు పైకప్పును కత్తిరించి.. లోపల ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఈ మృతులు అమిర్‌గఢ్ తాలూకాలోని ధన్‌పురా-విరంపూర్ గ్రామానికి చెందినవారని పోలీసు వర్గాలు తెలిపాయి.
అనంతరం గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి కారణం బొలెరో కారు డ్రైవర్ అని సమాచారం. ఆ కారు డ్రైవర్ హైవేలో రాంగ్ రూట్ నుండి వెళ్లి బస్సును ఢీకొట్టాడని స్థానికులు చెబుతున్నారు.
Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!