GST తగ్గింపులపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు.

New Update
GST Cut Benefits Reaching Consumers, Price Drop Bigger Than Expected, Says Nirmala Sitharaman

GST Cut Benefits Reaching Consumers, Price Drop Bigger Than Expected, Says Nirmala Sitharaman

ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని.. తాము తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. ఈ తగ్గింపులతో ప్రభుత్వ టార్గెట్‌ నెరవేరిందని పేర్కొన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఢిల్లీలో ఆమె సంయుక్త మీడియా నిర్వహించారు. 

Also Read: దీపావళి బంపరాఫర్.. కేవలం రూ.11కే 2TB క్లౌడ్ స్టోరేజ్

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. '' జీఎస్టీ 2.0 సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చాయి. పండుగ  సీజన్‌లో ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్, వినియోగ వస్తువల వంటి రంగాల్లో భారీ స్థాయిలో విక్రయాలు జరిగాయి. గతేడాది నవరాత్రి ఉత్సవాల్లో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది నవరాత్రి సీజన్‌లో 25 శాతం ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాలు పెరిగాయి. GST సంస్కరణల కారణంగా ఆహార ధరల తగ్గుతున్నాయని.. ఎలక్ట్రానిక్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తోంది. IMF వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతం పెంచిందని'' నిర్మలా సీతారామన్ అన్నారు. 

Also Read: విమానం గాల్లో ఉండగా మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు.. VIDEO

Advertisment
తాజా కథనాలు