AI Content: సోషల్ మీడియా సంస్థలకు షాక్.. ఏఐ కంటెంట్‌పై కేంద్రం కీలక ఆదేశాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంటెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్‌ (వాటర్‌మార్క్) వేయాలని ఆదేశాలు జారీ చేసింది.

New Update
Govt directs platforms to label AI content, deploy checks on misuse

Govt directs platforms to label AI content, deploy checks on misuse

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంటెంట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌కు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్‌ (వాటర్‌మార్క్)(AI content labelling) వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏఐ కంటెంట్‌ను అందరూ సులువుగా గుర్తించేలా ఆ లేబుల్‌ ఉండాలని సూచనలు చేసింది. ఒకసారి అప్లయ్‌ చేశాక ఆ లేబుల్‌ను గానీ, మెటా డేటాను గానీ తొలగించేందుకు లేదా కనబడకుండా ఉండేలా చేసేందుకు అవకాశం ఉండకూడదని చెప్పింది. 

Also Read: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే బుక్‌ వివాదం.. ఆ బుక్‌లో ఏముందో తెలుసా ?

Govt Directs Platforms To Label AI Content

చట్టవిరుద్ధమైన, అసభ్యకరమైన, మోసపూరిత ఏఐ కంటెంట్‌ను నిరోధించేందుకు సోషల్ మీడియా(Social Media) ప్లాట్‌ఫామ్‌లు ఆటోమేటెడ్‌ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. AI కంటెంట్‌ను దుర్వినియోగం చేస్తే పెనాల్టీలు, శిక్షల గురించి వినియోగదారులకు అవగాహన కల్పించాలని తెలిపింది. ఇందుకోసం ప్రతి మూడునెలలకొకసారి సందేశాలు పంపించాలని ఆదేశించింది. 

Also Read: బంగ్లాదేశ్‌లో దారుణం.. మరో హిందూ వ్యాపారి హత్య

ఏఐ జనరేటెడ్‌ లేదా డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను తొలగించేందుకు కేంద్రం సోషల్ మీడియా సంస్థలకు గడువు కూడా విధించింది. ఏఐ కంటెంట్‌కు సంబంధించి ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశాలు జారీ చేసినప్పుడు దాన్ని 3 గంటల్లోనే తొలగించేలా చూడాలని సూచించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్‌ విపరీతంగా పెరిగిపోతోంది. ఏది ఒరిజినల్? ఏది ఏఐ కంటెంట్‌ ? అనేది గుర్తుపట్టలేనంతంగా మారిపోయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏఐ కంటెంట్‌ను గుర్తించేలా వాటర్‌ మార్క్‌ పెట్టాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది. 

Advertisment
తాజా కథనాలు