/rtv/media/media_files/2026/02/10/ex-army-chief-general-naravane-book-controversy-2026-02-10-14-40-22.jpg)
Ex Army Chief General Naravane's Book controversy
సాధారణంగా సైనికాధికారులు పదవీ విరమణ చేసిన అనంతరం తమ అనుభవాలు పుస్తక రూపంలో రాస్తుంటారు. కానీ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణే రాసిన పుస్తకం మాత్రం రిలీజ్‌కు ముందే వివాదంలో ఇరుక్కుంది. పార్లమెంట్‌లో గందరగోళం నెలకొన్న నాటినుంచి ఢిల్లీ పోలీసుల దాక ఈ వివాదం ముదిరింది. వాస్తవానికి ఈ బుక్ 2024 ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో గల్వాన్ లోయ ఘర్షణలు, చైనాతో సరిహద్దు ఉద్రిక్తలు, అగ్నిపథ్ సైనిక నియామక స్కీమ్ గురించి నరవణే రాసిన పలు విషయాలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినట్లు సమాచారం.
చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి వచ్చాయని ఆ టైమ్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీరు ఏది సరైంది అనిపిస్తే అది చేయండని తమకు స్వేచ్ఛనిచ్చినట్లు నవరణే అందులో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అలాగే అగ్నిపథ్ స్కీమ్‌పై సైన్యం ముందుగా విముఖత చూపిందని.. లేదా దాని రూపకల్పనలో సైన్యం సూచించిన మార్పులు జరగలేదని ఆయన రాసినట్లు తెలుస్తోంది.
Also Read: ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్
ఫిబ్రవరి 2026 బడ్జెట్ సమావేశాల్లో విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని అంశాలు ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆయన పార్లమెంట్‌లో ఈ పుస్తక ప్రతిని చేతిలో పట్టుకుని ప్రధానికి గిఫ్ట్‌గా ఇస్తానంటూ మాట్లాడారు. దీనిపై కేంద్ర కూడా తీవ్రంగా స్పందించింది. రిలీజ్ కాని పూస్తకం గురించి సభలో మాట్లాడటం రూల్స్‌కు విరుద్ధమని స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఇతర కేంద్రమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు ఈ బుక్ అధికారికంగా రిలీజ్ కాకముందే దీనికి సంబంధించి పీడీఎఫ్ వెర్షన్లు, ప్రీపింట్ కాపీలు ఇంటర్నెట్‌లో లీక్ చేశారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో ఢిల్లీ పోలీసులు 'స్పెషల్ సెల్' ద్వారా FIR నమోదు చేశారు. ఈ పుస్తక ప్రచురణకర్త 'పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా' ఫిబ్రవరి 9, 2026న దీనిపై స్పందించింది. తాము ఈ పుస్తకాన్ని ఇంకా ముద్రించలేదని.. మార్కెట్లోకి విడుదల చేయలేదని తెలిపింది. సోషల్ మీడియాలో తిరుగుతున్న కాపీలు చట్టవిరుద్ధమని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: ఏఐ టూల్స్‌తో సాఫ్ట్‌వేర్ రంగానికి భారీ దెబ్బ.. క్లారిటీ ఇచ్చిన నిపుణులు
వాస్తవానికి కేంద్ర సర్వీస్ రూల్స్ ప్రకారం.. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు జాతీయ భద్రతకు సంబంధించిన వాటిపై పుస్తకాలు రాసేటప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్ నరవణే బుక్ గత ఏడాదిన్నర కాలంగా రక్షణశాఖ సమీక్షలో పెండింగ్‌లో ఉండిపోయింది. అయితే పర్మిషన్ రాకుండానే లీక్ ఎలా అయ్యిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రభుత్వం దీన్ని భద్రతా ఉల్లంఘన అని అంటోంది. విపక్షాలు మాత్రం వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నాయి.ఈ వ్యవహారంపై ఇంకా పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
Follow Us