Asia Cup: క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌..ఆసియా కప్‌ ట్రోఫీ వస్తోంది.

ఆసియా కప్‌లో విజయం సాధించిన భారత్‌కు ట్రోఫీ ఇవ్వకుండా రాద్ధాంతం చేసిన ఏసీసీ చీఫ్‌ నఖ్వీ ఎట్టకేలకు ట్రోఫీ అందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకట్రేండు రోజుల్లో ట్రోఫీని భారత్‌కు అప్పగించే అవకాశముందని బీసీసీఐ (BCCI) ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

New Update
Asia Cup 2025 Schedule, Start Date Fixed

Asia Cup 2025

Asia Cup: ఆసియా కప్‌లో విజయం సాధించిన భారత్‌కు ట్రోఫీ ఇవ్వకుండా రాద్ధాంతం చేసిన ఆసియా క్రికెట్‌  కౌన్సిల్‌ చీఫ్‌ నఖ్వీ ఎట్టకేలకు ట్రోఫీ అందించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆసియా కప్‌ ట్రోఫీని భారత్‌కు అప్పగించే అవకాశముందని బీసీసీఐ (BCCI) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ సీరియస్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆసియా కప్‌ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా  విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకున్న తర్వాత నఖ్వీ చేతుల మీదుగా కప్‌ అందుకోవడానికి టీమ్‌ ఇండియా నిరాకరించింది.దీంతో నఖ్వీ ట్రోఫీని తనతో తీసుకువెళ్లాడు. ఈ విషయంలో భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు నెలరోజులు గడుస్తున్నా.. ఇంకా ట్రోఫీ, మెడల్స్‌ను అందించకపోవడంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్‌ 4న ఐసీసీ త్రైమాసిక సమావేశం జరగనుంది. ఈలోగా నఖ్వీ.. ఆ ట్రోఫీని భారత్‌కు అప్పగించాలని, లేకపోతే ఈ విషయాన్ని ఐసీసీ (ICC) దృష్టికి తీసుకువెళతామని ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో నఖ్వీ మెట్టుదిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: రూ.8 కోట్ల FDలు, 1.1 కిలోల బంగారం.. కాబోయే CJI ఆస్తుల వివరాలివే

‘దాదాపు నెల గడుస్తున్నా.. ఇప్పటికీ ఆసియా ట్రోఫీని మాకు అందించలేదు. ఇది సరైంది కాదు’ అని సైకియా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ట్రోఫీ విషయమై ఏసీసీకి లేఖ పంపినట్లు ఆయన ధ్రువీకరించారు. అయితే దానికి బదులుగా నఖ్వీ.. ఏసీసీ కార్యాలయంలోనే ట్రోఫీని తీసుకోవాలని బదులిచ్చాడన్నారు. ‘మేం ఏసీసీ ఛైర్మన్‌కు ఆసియా కప్‌ ట్రోఫీ విషయమై లేఖ పంపాం. అయినా ఆయన పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. ట్రోఫీ ఇప్పటికీ వారి స్వాధీనంలోనే ఉంది. ఒకట్రెండు రోజుల్లో తప్పకుండా అది ముంబయిలోని బీసీసీఐ కార్యాలయానికి వస్తుంది’ అని సైకియా ఆశాభావం వ్యక్తం చేశారు. ఐసీసీలో ఫిర్యాదు చేసే అవకాశం ఉండటంతో నఖ్వీ ట్రోఫీని పంపుతాడన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే...

ఆసియా కప్‌లో టీం ఇండియా మూడుసార్లు పాకిస్థాన్‌తో తలపడితే, అన్ని మ్యాచ్‌లనూ నెగ్గింది. ఫైనల్‌లోనూ పాక్‌పై నెగ్గి ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు.. పాక్‌ క్రికెటర్లతో షేక్‌హాండ్‌ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపలేదు. అలాగే ఏసీసీ చీఫ్‌గా ఉన్న పాకిస్థాన్‌కు చెందిన నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికీ భారత బృందం ఆసక్తి చూపలేదు. ఆ సమయంలో  ట్రోఫీని మరొకరి చేతుల మీదుగా భారత జట్టుకు అందించాల్సింది..కానీ, నఖ్వీ  ట్రోఫీ, మెడల్స్‌ను తనతోపాటు తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాటిని టీమ్‌ఇండియాకు అందించకుండా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఆయనపై ఫిర్యాదు చేస్తామన్న బీసీసీఐ వార్నింగ్‌తో నఖ్వీ మెట్టుదిగి ట్రోఫీని పంపిస్తాడని భారత్‌ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: అమలాపురంలో మిస్సింగ్ కేసు కలకలం..ఘోరమైన స్థితిలో డెడ్ బాడీ!

Advertisment
తాజా కథనాలు