Asia Cup match: నల్ల బ్యాడ్జీలతో భారత క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత క్రికెటర్లు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి బరిలోకి దిగారు. కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించేందుకు భారత జట్టు ఈ నిర్ణయం తీసుకుంది.