/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
Gold Record Price: భారతీయులకు బంగారం అంటే కాస్తా మోజు ఎక్కువే. వారు ఎంత అందంగా ఉన్నా బంగారు నగదు ధరిస్తే తప్ప తృప్తిపడరు. అందుకే పండుగలు, శుభకార్యాలు తదితర వేడుకల్లో బంగారు నగలతో దర్శనమివ్వడానికే మొగ్గు చూపుతారు. నగలు ధరిస్తే వారి అందం మరింత రెట్టింపు అవుతుందని వారు భావిస్తుంటారు. అయితే నేడు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, పలు కారణాలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాల కూడా బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి.
Also Read: Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!
అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు ఇటువైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే ధరలు భారీగా పెరుగుతున్నాయి.ఈ ఎఫెక్ట్ కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పసిడి ధరలపై పడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్డ్ రేట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Also Read: Prakasam: క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి
ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే నేడు (ఏప్రిల్ 21న) స్పాట్ గోల్డ్ ధర ఒక్కసారిగా 1.7% ఎగబాకి ఔన్స్‌కి $3,383.87 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు సెషన్‌లో $3,384 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పసిడిని కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మాత్రం ఈ రేట్లు షాక్ ఇస్తున్నాయి.
Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
ఈ బంగారం పెరుగుదల ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఈ క్రమంలో ఏప్రిల్ 21న సోమవారం రోజు భారతదేశంలో బంగారం ధరలు కూడా పంజుకున్నాయి. గుడ్‌రిటర్న్స్ డేటా ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు రూ.9,8350కి చేరుకుంది. ఇంకా ఇలానే వృద్ధి కొనసాగితే బంగారం కొనాలనుకున్నవాళ్లు ఇంకొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ధరలు ఈ వారంలో లక్ష రూపాయల స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!