/rtv/media/media_files/2025/04/20/eExvCojKlPMPmnu8C9oP.jpg)
pavani-reddy
తమిళ టీవీ నటి, బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి రెండో పెళ్లి చేసుకుంది. బిగ్ బాస్ షోలో పరిచయం అయిన కొరియోగ్రాఫర్ అమీర్ తో రెండేళ్లు ప్రేమలో ఉన్న ఆమె ఏప్రిల్ 20 ఆదివారం రోజున హిందూ సంప్రదాయంలో మూడుముళ్లతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Cheers to love! 🥳💖 #Amir and #Pavani from Bigg Boss Tamil have taken the plunge and tied the knot in a dreamy celebration! Here’s to forever for this beautiful couple!#AmirPavaniWedding #Amir #PavniReddy #Pavni pic.twitter.com/hrkAzPrxRf
— Chennai Times (@ChennaiTimesTOI) April 20, 2025
తమిళ సీజన్ 5 లో పరిచయం
ఈ జంట తమ పెళ్లి గురించి రియాలిటీ షో జోడీ ఆర్ యు రెడీలో ప్రకటించారు. ఫిబ్రవరి 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట బిగ్ బాస్ తమిళ సీజన్ 5 లో పాల్గొన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో షోలోకి అడుగు పెట్టాడు అమీర్. అక్కడ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్త లవ్ గా మారింది. రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ జంట తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.
సోషల్ మీడియాలో ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హీరో అజిత్ నటించిన తునివు చిత్రంలో ఈ జంట తెరపైన కలిసి నటించడం ద్వారా వార్తల్లో నిలిచారు. కాగా పావనికి గతంలో ప్రదీప్ కుమార్ తో వివాహం జరిగింది, అతను 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఆ తరువాత డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె మళ్లీ షోలో మెరిశారు. తెలుగులో ఈమె గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, చారీ 111 సినిమాల్లో నటించారు.
Also Read : Rajasthan : 17 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి మహిళ లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!