/rtv/media/media_files/2025/03/18/BhQTUOVJa6sTT9fFRPRW.jpg)
Goa University Professor leaks paper for girl friend
Goa University: గోవా విశ్వవిద్యాలయంలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రణవ్ నాయక్ తన స్నేహితురాలిని టాపర్‌గా నిలబెట్టడానికి మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్ పేపర్‌ను లీక్ చేశాడు. ఆ వివాహిత ప్రొఫెసర్ల లాకర్ల నుంచి ప్రశ్నాపత్రాలను దొంగిలి టాపర్‌గా నిలిచింది. విద్యార్థులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్..
ఇదిలా ఉంటే.. ఇటీల ఏపీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు రావడం సంచలనం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష జరగాల్సి ఉండగా అరగంట ముందే పేపర్ లీక్ కావడం సంచలనం రేపుతోంది. కాలేజీ యాజమాన్యమే లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై వెంటనే స్పందించని మంత్రి లోకేష్.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బి.ఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందన్నారు.
ఇది కూడా చూడండి: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!
మధ్యాహ్నం 2.గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‍మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై విచారణ నిర్వహించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చూడండి: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!
Follow Us