రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ అమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహా, టీపీసీసీ ఛైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళిగా రెండు నిమిషాలు మోనం పాటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ధుతున్నామన్నారు. పట్టుదలతో ఈ జాతికి న్యాయం చేశామని ఆయన తెలిపారు.
Also read : బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు!
వర్గీకరణ.. మాదిగల న్యాయమైన హక్కు అని ఆయన పునరుద్ఘటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో వర్గీకరణ గురించి అధ్యయనం చేసి భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు రాకుండా.. రిటైర్ట్ జడ్జ్‌తో వన్ మెన్ కమిషన్ వేశామని రేవంత్ రెడ్డి వివరించారు. కమిషన్ 199 పేజీల నివేదికను సమర్పించింది. మూడు గ్రూపులుగా విభజించామన్నారు. ఎస్సీ వర్గీకరణ.. ఎవరికీ వ్యతిరేకం కాదు.. మాదిగల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమని తెలిపారు. గతంలో వర్గీకరణపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. నన్ను సభనుండి బయటికి పంపించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Also read : మమ్ముట్టి కోసం పూజలు చేసిన మోహన్‌లాల్.. ఏం జరిగిందంటే?
బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ చేయలేదని మంద కృష్న మాదిగ గుర్తించాలని ఆయన కోరాడు. రాహుల్ గాంధీ పట్టుబట్టి ఎస్సీ వర్గీకరణ జరగడానికి ఆయనకు ఎంతో శక్తిని ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేస్తున్నామని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వివరించారు. మాల, మాదిగల వర్గీకరణ ఎన్నో ఏళ్ల చిక్కుముడి.. దానికి పరిష్కారం చూపించామని చెప్పుకొచ్చారు.