Census : 15 ఏండ్ల తర్వాత జనగణన కు గెజిట్‌ నోటిఫికేషన్‌.. ఈసారి అదికూడా చెప్పాల్సిందే...

ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 15 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.

New Update
Census

Census

Census : ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 15 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ  సోమవారం విడుదల చేసింది. రెండు దశల్లో జరుగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వదికాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్‌ 1 నుంచి, రెండో దశ 2027, మార్చి 1 నాటికి పూర్తి కానుంది.

Also Read: Israel: అణు ముప్పు సాకు మాత్రమే..అసలు టార్గెట్ ఇరాన్ ప్రభుత్వం కూల్చివేతే..

 ఈ సారి చేపట్టనున్న జన గణనతోపాటు కుల గణననూ చేపట్టనున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే సాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.దీనితో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే పోర్టర్లు, యాప్‌లలోనూ ప్రజల తమంతట తామే వివరాలను నమోదు చేసుకునే వెసలు బాటును కూడా కల్పిస్తున్నారు.డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది. సెక్షన్‌ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు వివరించింది.

Also Read:ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

నిజానికి దేశంలో జనగణనను ప్రతి పదేండ్ల కొకసారి నిర్వహిస్తారు.2011లో చివరి సారిగా ఈ ప్రక్రియను చేపట్టారు.  అప్పుడు కూడా రెండు విడతల్లో జనాభా లెక్కలు చేశారు. అయితే ఆ తర్వాత 2021లో జన గణనను నిర్వహించాలి ఉంది. కానీ, కొవిడ్‌ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పుడు 15 ఏండ్ల తర్వాత తొలిసారిగా జనాభా గణనను నిర్వహించనున్నారు. దీంతోపాటు తొలిసారిగా కులగణనను కూడా చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా చేపట్టనున్నట్టు గత నెలలో కేంద్రం వెల్లడించడం తెలిసిందే. కాగా జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అందులో ఓ కొత్త ప్రశ్న కూడా ఉంది.  అదే కులానకి సంబంధించిన ప్రశ్న.దేశంలో 1872 నుంచి మొదలైన జనగణనలో ఇంతవరకు ఈ ప్రశ్న అడగలేదు.  ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది. అయితే ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరికీ తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో ఈసారి వస్తున్న పెద్ద మార్పు ఇదే. 1931 తర్వాత ఇప్పుడు జనగణన, కులగణనను ఒకేసారి చేపడుతున్నారు.

Also Read:Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!

Advertisment
తాజా కథనాలు