ఈ సారి కులగణన వేరే విధంగా.. ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే ఇంటికే
తెలంగాణలో ఫిబ్రవరి 16-28 మధ్య మరోసారి కులగణన చేయనున్నారు. దీనికోసం టోల్‌ఫ్రీ నెం. 040-211 11111 ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించనున్నారు. MPDO, వార్డు ఆఫీసుల్లో కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.