Maoist new chief: మావోయిస్టు కొత్త దళపతి అతనే.. కేశవరావు ఎన్‌కౌంటర్‌తో కీలక మార్పులు!

ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతితో మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కొత్త దళపతిని ఎన్నుకోనుంది. గణపతి, మల్లోజుల వేణుగోపాల్‌, బెంగాల్‌కు చెందిన రాజా పదవి రేసులో ఉండగా.. గణపతికే మళ్లీ పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

New Update
maoist cheaf

Ganapathi elected as new new chief of Maoist party

Mavo Ganapathi: సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో తదుపరి సారథి ఎవరన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. కేంద్ర కమిటీలోని 17 మంది సభ్యుల్లో ఎవరు దళిపతి కానున్నారు..? బెంగాల్‌కు చెందిన రాజనా..? లేక తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్‌కు అవకాశం దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది. వేణుగోపాల్‌ ప్రస్తుతం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. దండకారణ్యంలో కీలక బాధ్యతలు చూస్తున్నారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగానూ వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరిలోనే ఒకరికి అగ్ర పదవి లభించే అవకాశం ఉందని ప్రజాసంఘాల నేతలు చెబుతున్నారు. 

గణపతికి 15 ఏళ్ల అనుభవం..

తిప్పిరి తిరుపతి, బాలకృష్ణ వంటి నేతలు కూడా కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు. అయితే తాజా పరిస్థితుల్లో మాజీ దళపతి గణపతికే పార్టీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రం బాధ్యతల్లో ఉన్నారు. 70 ఏళ్ల వయస్కుడైన ఆయనకు క్లిష్ట సమయంలో మరోసారి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటుకు ముందు గణపతి పీపుల్స్‌వార్‌కు కేంద్ర కమిటీ కార్యదర్శిగా 15 ఏళ్లపాటు పనిచేశారు. పీపుల్స్‌వార్‌-ఎంసీసీ విలీనమై మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2004 నుంచి 2018 వరకు ఆయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

రెండు పదవులు ఖాళీ..

ఆ సమయంలో బస్వరాజ్‌ మిలిటరీ కమిషన్‌ చీఫ్‌గా ఉన్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో గణపతి బాధ్యతలు వదులుకోవడంతో 2018లో బస్వరాజ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. మిలిటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగానూ ఆయనే ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో ఆయన మరణించడంతో రెండు పదవులు ఖాళీ అయినట్లయింది. అసలే ఆ పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎప్పుడు, ఎవరు పారామిలిటరీ డ్రోన్‌ కెమెరాలకు చిక్కుతారు.. ఎవరు, ఎప్పుడు ఎన్‌కౌంటర్లో మరణించారన్న వార్త వస్తుంది అన్న భయం పార్టీతోపాటు ప్రజాసంఘాల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో అగ్ర పదవిని అనుభవజ్ఞుడైన గణపతికే తిరిగి కట్టబెడతారా.. లేక కొత్తగా మరొకరిని ఎంపిక చేస్తారా అన్నది త్వరలో తేలనుంది.

Also Read: ముంబైలో అటాక్‌కు జ్యోతి బిగ్ స్కెచ్.. ఆ ప్రాంతాల్లో వీడియోలు తీసి పాక్‌కు.. వెలుగులోకి సంచలన విషయాలు!

96 నుంచి 46 జిల్లాలకు..

మావోయిస్టులను వేధిస్తున్న మరో సమస్య వయోభారం. పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన అగ్రనాయకుల్లో ఎక్కువ మంది 60 నుంచి 75 ఏళ్ల మధ్యలో ఉన్నారు. వీరిలో చాలామంది వయోభారంతో, అనారోగ్యాలతో కదల్లేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలిన అగ్రనాయకత్వాన్ని కాపాడుకోలేని పరిస్థితి వారికి ఏర్పడింది. 2010 ప్రాంతాల్లో 96 జిల్లాల్లో బలమైన ప్రభావం చూపిన మావోయిస్టు పార్టీ 2023 నాటికి 46 జిల్లాలకు పరిమితమైంది. ఆపరేషన్‌ కగార్‌ తర్వాత ఆరు జిల్లాలకే పరిమితమైంది.

Also Read: రూ.15 వేల పాక్‌ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత

ఇదిలా ఉంటే... : భారతదేశానికి అతి పెద్ద అంతర్గత శత్రువు మావోయిస్టు పార్టీ అని 13 సంవ త్సరాల క్రితమే అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. అలాంటి పార్టీలో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి హోదాలో హతమైన తొలినేత సంబాల కేశవరావు ఒక్కరే కావడం గమనార్హం. సీతారామయ్య తర్వాత కార్యదర్శిగా ఎన్నికైన గణపతి హయాంలో పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా వ్యాపించాయి. అదే సమయంలో మధ్యభారతంలో బలంగా ఉన్న కమ్యూనిస్ట్ మావోయిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ), పీపుల్స్ వార్ రెండూ 2004 సంవత్సరంలో విలీనమై మావోయిస్టు పార్టీగా అవతరించాయి. 2018 నవంబరు 10 వరకు పార్టీ సుప్రీంగా కొనసాగిన గణపతి అనారోగ్య కారణాలతో తప్పుకొని కేశవరావుకు బాధ్యతలు అప్పగించారు.

maoist | chattisgarh | telangana | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు