Plane Crash: విమానంలో లేని గగన్.. అజిత్ పవార్ చనిపోవడానికి కారణమిదేనా?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం గురి కావడంతో మృతి చెందారు. అయితే విమాన ప్రయాణాల్లో అత్యంత ముఖ్యమైన ‘గగన్’ అనే శాటిలైట్ భద్రతా వ్యవస్థ ఈ విమానంలో పనిచేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది.

New Update
ajith-pawar-plane-crash-2026-01-28-12-11-47

Plane crash

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం గురి కావడంతో మృతి చెందారు. అయితే విమానంలో సాంకేతిక లోపం కారణంగానే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమాన ప్రయాణాల్లో అత్యంత ముఖ్యమైన ‘గగన్’ అనే శాటిలైట్ భద్రతా వ్యవస్థ ఈ విమానంలో పనిచేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సాంకేతిక లోపమే విమానం దారి తప్పి కూలిపోవడానికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Ajith Pawar Plane Crash: అజిత్ పవార్ ప్రయాణించిన విమానం 'లీర్జెట్ 45' వివరాలు.. గతంలో కూడా ఇదే విమానానికి ఘోర ప్రమాదం!

ఏమిటీ ‘గగన్’ వ్యవస్థ?

‘గగన్’ అనేది ఉపగ్రహాల ఆధారంగా పనిచేసే ఒక అత్యాధునిక మార్గదర్శక వ్యవస్థ. ఇది విమానం ఆకాశంలో ఎక్కడ ఉందో అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని పైలట్‌కు, కంట్రోల్ రూమ్‌కు అందిస్తుంది. ముఖ్యంగా వాతావరణం సరిగ్గా లేనప్పుడు, దట్టమైన పొగమంచు లేదా కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ వ్యవస్థ పైలట్‌కు కళ్లు, చెవుల్లా పనిచేస్తుంది. ఇది ఉంటే విమానం రాడార్ నుంచి అదృశ్యమయ్యే అవకాశాలు చాలా తక్కువ.

నెల రోజులుగా పనిచేయని వ్యవస్థ?

దర్యాప్తు అధికారుల అంచనా ప్రకారం ప్రమాదానికి గురైన ఈ విమానంలో గత 28 రోజులుగా గగన్ వ్యవస్థ పని చేయడం లేదు. దాదాపు నెల రోజులుగా ఈ అత్యవసర భద్రతా పరికరం లేకుండానే విమానాన్ని నడిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానం రాడార్ నుంచి అదృశ్యం కావడానికి, పైలట్ సరైన దిశను గుర్తించలేకపోవడానికి ఈ సాంకేతిక లోపమే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: కుప్పకూలిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం.. కారణమిదే?

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు

విమానం ప్రయాణిస్తున్న మార్గంలో వాతావరణం అనుకూలించకపోయినా లేదా భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉన్నా ‘గగన్’ వ్యవస్థ ఉంటే విమానాన్ని సురక్షితంగా నడిపే అవకాశం ఉంటుంది. కానీ ఈ విమానంలో ఆ సౌకర్యం లేకపోవడంతో పైలట్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. భద్రతా నియమాలను పాటించడంలో విమానయాన సంస్థ నిర్లక్ష్యం వహించిందా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు