/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-10-29-10.jpg)
Ajit pawar
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం కావడంతో అతనితో పాటు ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ బారామతి వెళ్తుండగా.. అక్కడ ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగి విమానం మొత్తం కాలిపోయింది. విమానంలో ఉన్న పైలట్, సిబ్బంది కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఈ విమాన ప్రమాదం ఉదయం 8:45 గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయకపోవడం లేదా ఇంజిన్‌లో ఏదైనా సమస్య తలెత్తి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Plane carrying Maharashtra Deputy CM Ajit Pawar crashes during landing#Ajitpawar#planecrashpic.twitter.com/hwzRGWWgjL
— Apfel Der 🩵 (@Apfelderr) January 28, 2026
Follow Us