ORS పదాన్ని వినియోగించవద్దు.. FSSAI కీలక ప్రకటన

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్‌ఎస్‌(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.

New Update
FSSAI Bans Use Of 'ORS' On Food Products, Withdraws Earlier Orders Allowing Term With Disclaimers

FSSAI Bans Use Of 'ORS' On Food Products, Withdraws Earlier Orders Allowing Term With Disclaimers

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్‌ఎస్‌(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అన్న వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆహార పదార్థాల పేరులో గానీ, ట్రేడ్‌మార్క్‌, ప్రిఫిక్స్‌, సఫిక్స్‌లో ఎక్కడా కూడా ఈ పదం వాడటం అనేది FSSAI యాక్ట్‌ 2006 రూల్స్‌కు విరుద్ధమని పేర్కొంది. 

Also Read: రైతుల వెంటపడ్డ పులి, భయంతో చెట్లెక్కిన స్థానికులు.. వీడియో వైరల్

2022 జులైలో అలాగే 2024 ఫిబ్రవరిలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం ORS అనే పదాన్ని పరిమితంగా వాడేందుకు FSSAI పర్మిషన్ ఇచ్చింది. తాజాగా దీనిపై సమీక్ష జరగింది. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఆ పదాన్ని వాడటం వినియోగదారులను తప్పుదారి పట్టించే అంశంగా పరిగణిస్తామని పేర్కొంది.  

Also Read: ఆహారంలో వెంట్రుకలు.. ప్రయాణికుడికి రూ.35వేలు పరిహారం

ఒకవేళ ఎవరైనా ఈ పదాన్ని వాడితో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ఫుడ్‌ కంపెనీలు వెంటనే తమ ఉత్పత్తుల పేర్లు, ట్రేడ్‌మార్క్‌ ప్రకటనల్లో ORS పదాన్ని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లేబులింగ్, ప్రకటనల రూల్స్‌ను కూడా కచ్చితంగా పాటించాలని సూచనలు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాలకు అనుగుణంగా లేని పానీయలను ఓఆర్‌ఎస్‌ పేరుతో అమ్మడం వల్ల డీహైడ్రేషన్‌తో ఉన్న రోగులకు సరైన వైద్య చికిత్స అందడం లేదనే కారణంతో FSSAI ఈ చర్యలకు పాల్పడింది. 

Also Read: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా ?

Advertisment
తాజా కథనాలు