White House: వైట్‌హౌస్‌ కూల్చివేత.. వివాదాస్పదమైన ట్రంప్‌ నిర్ణయం

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ తన చిరకాల కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న 'బాల్‌రూమ్' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం శ్వేతసౌధంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈస్ట్ వింగ్ భవనాన్ని కూల్చివేయడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.

New Update
White House East Wing demolish

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌(white-house) లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిరకాల కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న 'బాల్‌రూమ్' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని కోసం శ్వేతసౌధంలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈస్ట్ వింగ్ భవనాన్ని కూల్చివేసేందుకు నిర్ణయించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.

ట్రంప్ స్వయంగా తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. సోమవారం నుంచే ఈస్ట్ వింగ్‌లోని ప్రవేశ ద్వారం, కిటికీలతో పాటు కొన్ని భాగాలను కూల్చివేసే పనులు ప్రారంభమయ్యాయి. ఈ వారాంతానికి భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 250 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,000 కోట్లు) ఖర్చవుతుందని అంచనా.

Also Read :  H1 బీ వీసా ప్రభావం.. కెనడా బిగ్‌ ప్లాన్

రూ. 2,000 కోట్లతో బాల్‌రూమ్ నిర్మాణం

బాల్‌రూమ్ నిర్మాణం 150 ఏళ్లుగా అమెరికా అధ్యక్షుల కల అని ట్రంప్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 999 మంది కూర్చునేందుకు వీలుగా ఈ నూతన బాల్‌రూమ్‌ను నిర్మించనున్నారు. దేశాధినేతలు, ప్రపంచ నాయకుల గౌరవార్థం ఇచ్చే విందులు, గ్రాండ్ పార్టీలకు ఇది ఉపయోగపడుతుందని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా, ఈ నిర్మాణం కోసం అమెరికన్ పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి భారం పడదని, తన సొంత నిధులతో పాటు అనేకమంది దాతలు, గొప్ప అమెరికన్ కంపెనీల ఆర్థిక సహకారంతో దీనిని చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Also Read :  దమ్ముంటే మమ్నల్ని ఎదుర్కో.. ఆసిం మునీర్‌కు టీటీపీ హెచ్చరిక

1902లో నిర్మించిన ఈస్ట్ వింగ్, ఫస్ట్ లేడీ కార్యాలయాలతో పాటు సందర్శకుల ప్రవేశ ద్వారంగా సేవలు అందించింది. ఇంతటి చారిత్రక చిహ్నాన్ని కూల్చివేయడంపై డెమొక్రాటిక్ పార్టీ నాయకులు, చరిత్ర పరిరక్షణ సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కూల్చివేత నిర్ణయంపై ‘నేషనల్ ట్రస్ట్ ఫర్ హిస్టారిక్ ప్రిజర్వేషన్’ అనే సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. వైట్‌హౌస్ ఒక జాతీయ చారిత్రక చిహ్నమని, కూల్చివేత పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ అధికారులకు లేఖ రాసింది. డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసిన హిల్లరీ క్లింటన్.. వైట్‌హౌస్ ట్రంప్ ఇల్లు కాదని, ఆయన దాన్ని నాశనం చేస్తున్నారని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు