Supreme Court: పోలీసులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి: సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు ఇకనుంచైనా వాక్‌ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని సూచించింది. ఇంతకీ అసలు ఏం వ్యవహారంపై ఇలా చెప్పిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.

New Update
Supreme Court

Supreme Court

సుప్రీంకోర్టు పోలీసులకు కీలక సూచనలు చేసింది. పోలీసులు ఇకనుంచైనా వాక్‌ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని చెప్పింది. రెచ్చగొట్టే పాటను షేర్‌ చేశారనే ఆరోపణలపై తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే భావప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది.  అలాగే కేసు తీర్పును రిజర్వ్ చేసింది. 

Also Read: నట్టు, బోల్ట్ బిగించాల్సిందే.. రష్మికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బోల్డ్ కామెంట్స్!

ఇక వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌ జామ్‌నగర్‌లోని ఇటీవల ఓ సామూహిక వివాహాల కార్యక్రమం జరిగింది. ఇందులో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ పాల్గొన్నారు. ఆ తర్వాత ఓ పద్యంతో ఉన్న వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఈ పాట ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని ఈ ఏడాది జనవరి 3న ఎంపీపై పోలీసు కేసు నమోదైంది. దీంతో ఆయన ముందుగా గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.   

Also Read: రణవీర్‌ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

ఆయన పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల గురించి పోలీసులకు మరోసారి వివరించింది. అది కేవలం పద్యం మాత్రమేనని.. అనువాదంలో కొంత సమస్య ఏర్పడి ఉండొచ్చని చెప్పింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేముందు పోలీసులు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలని చెప్పింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయ్యిందని.. పోలీసులు ఇప్పటికైనా భావప్రకటనా స్వేచ్ఛ గురించి పోలీసులు అర్థం చేసుకోవాలని సూచించింది. చివిరికి ఈ వ్యవహారంపై తీర్పును రిజర్వులో ఉంచింది.   
 Also Read: రెండు కుటుంబాల్లో విషాదం నింపిన వాట్సప్ ముద్దు.. ఇద్దరినీ నరికి చంపిన భర్త!

Also Read: మార్చి నుంచే దంచికొట్టనున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వడదెబ్బే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు