/rtv/media/media_files/2025/03/03/iPEfg7cZn5IfmajKTy8J.jpg)
kerala kiss Photograph: (kerala kiss)
Whatsapp Kiss: కేరళలో దారుణం జరిగింది. వాట్సప్ మెసేజ్ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఇంటిపక్కనుండే స్నేహితుడే తన భార్యపై కన్నేయడంతో తట్టుకోలేక పోయిన వ్యక్తి ఫ్రెండ్ తో పాటు తన భార్యను కూడా హతమార్చాడు. ఇద్దరినీ వెంటాడి వేటాడి నరికి నరికి చంపాడు. ఈ భయంకరమైన ఘటన కేరళలోని పతనం తిట్ట కలంజూరులో చోటుచేసుకోగా స్థానికులంతా ఉలిక్కిపడ్డారు. పోలీసులు సైతం ఆశ్చర్యపోయిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వైష్ణవి వాట్సాప్​​కు ముద్దు..
పతనంతిట్టలోని కలంజూరుకు చెందిన బైజు (35), వైష్ణవి (28)కి కొంతకాలం క్రితం పెళ్లి అయింది. వారికి 10,5 సంవత్సరాల ఇద్దరు కొడుకులున్నారు. అయితే అదే కాలనీలో తన తల్లితో కలిసి ఉంటున్న వైష్ణవి స్నేహితుడు విష్ణు (30)ని అప్పుడప్పుడు వీరి ఇంటికి వస్తుంటాడు. వైష్ణవితో వాట్సప్ చాటింగ్ కూడా చేస్తుంటాడు. కొంతకాలంగా దీనిని పెద్దగా పట్టించుకోలేదు బైజు. అయితే ఇటీవల విష్ణు ఓ సారి వైష్ణవి వాట్సాప్​​కు ముద్దు ఎమోజీ పంపించాడు. అది అనుకోకుండా బైజు కంటపడింది. దీంతో వైష్ణవిని నిలదీయగా ఇద్దరమధ్య వివాదం జరిగింది.
స్నానం చేసి బట్టలు మార్చుకుని..
ఈ గొడవలోనే వైష్ణవి ఫ్రెండ్ విష్ణు ఇంటికి వెళ్లింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన బైజు.. కొడవలి పట్టుకుని విష్ణు ఇంటికి వెళ్లాడు. భార్యను బయటకు రమ్మని కేకలు వేసిన ఆమె రాలేదు. విష్ణు ఇంట్లోకి బలవంతంగా చొరబడిన బైజు.. వైష్ణవిని బయటకు లాకెళ్లి కొడవలితో చాలా చోట్ల నరికాడు. బైజును ఆపడానికి వెళ్లిన విష్ణును కూడా అదే కొడవలితో వేటు వేశాడు. విష్ణు, వైష్ణవి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. అయితే వారిద్దరిని నరికిన తర్వాత రక్తపు మరకలు కనిపించకుండా బైజు స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. ఆ తర్వాత మరో స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పేశాడు. వెంటనే అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బైజును అరెస్ట్ చేశారు.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
Follow Us