ఈవీఎంలపై అనుమానంతో ఆ గ్రామంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు.. చివరికి

మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లా మర్కద్వాడి గ్రామంలో సంచలన వ్యవహారం బయటపడింది. ఈవీఎంలపై అనుమానంతో అక్కడి గ్రామస్థులు చట్టవిరుద్ధంగా బ్యాలెట్‌ పేపర్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో ఆ ఎన్నికలు రద్దు చేశారు.

New Update
EVM (File Photo)

EVM (File Photo)

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమి ఓడిపోయిన సంగతి తెలిసిందే. మహాయుతి కూటమి అధికారంలోకి రావడంతో విపక్ష నేతలు గతంలో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంలు హ్యాక్ చేస్తున్నారని.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల సోలాపూర్‌లోని మర్కద్వాడి గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం దుమారం రేపుతోంది. 

Also Read: బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ గ్రామంలో ఎన్నికలు జరిగాయి. కానీ అక్కడి స్థానికులు బ్యాలెట్‌ పేపర్లను వినియోగించి చట్టవిరుద్ధంగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఈ విషయం అక్కడి అధికారులకు తెలియడంతో వెంటనే ఆ ఎన్నికలు రద్దు చేశారు. దీంతో ఎన్సీపీ (శరద్‌ పవార్) ఎమ్మెల్యే ఉత్తమ్‌రావు జన్‌కర్‌ మద్దతుదారులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తమ్‌రావు.. మల్షిరాస్ అసెంబ్లీ నియోజకవర్గంలో 13 వేల తేడాతో ఓట్లతో గెలిచారు. కానీ మర్కద్వాడి గ్రామంలో బీజేపీ నేత రామ్‌ సత్పుట్ కన్నా ఆయనకు తక్కువగా ఓట్లు వచ్చాయి.  

Also Read: లవర్లకు ఓయో బిగ్ షాక్.. పెళ్లి కాని వారికి ఇక నో రూమ్!

దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ గ్రామంలోని కొందరు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో తమ గ్రామంలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటన చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే ఎన్నికలు కూడా చట్టవిరుద్ధంగా నిర్వహించాలని ప్లాన్ వేశారు. చివరికి అధికారులు ఈ ఎన్నికలు జరగనివ్వకుండా రద్దు చేశారు. మరోవైపు ఇలా చట్టవిరుద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేయడాన్ని ఆ గ్రామంలో పలువురు ఖండిస్తున్నారు. బీజేపీ నేత రామ్‌ సత్పుల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయనకు గ్రామంలో జనాధరణ ఉందని చెబుతున్నారు.  ప్రస్తుతం ఈ అంశం మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు