భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఢిల్లీలో గౌరవం దక్కింది. 2020 ఆగస్ట్ 31న ఆయన మరణించిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన పేరు మీద ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ఓ మెమోరియల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రభుత్వం స్థలం కేటాయించింది. కాంగ్రెస్ నాయకురాలు, ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఆయన సమాధికి రాజ్ ఘాట్ లో స్థలం కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్(రాజ్ ఘాట్) లోపల ప్రణబ్ ముఖర్జీ పేరుతో మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Also Read: HYD: హైడ్రా మొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఈ నిర్ణయానికి శర్మిష్ట ముఖర్జీ ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాధాలు తెలిపారు. మహాత్మా గాంధీ, జవహల్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, చరణ్ సింగ్ లాంటి ప్రముఖుల సమాధులు రాజ్ ఘాట్ లో ఉన్నాయి. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. ఆయన అంత్యక్రియలు కూడా రాజ్ ఘాట్ లోనే చేశారు. Also Read: Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ ప్రణబ్ ముఖర్జీ కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రి పదవులను కూడా నిర్వహించాడు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు అతను కేంద్ర ఆర్థిక మంత్రిగా 2009 నుండి 2012 వరకు తన సేవలనందించాడు. ఆయన 2012 నుంచి 2017 వరకు ఇండియాకు 13వ రాష్ట్రపతిగా పని చేశారు. దాదాపు ఆరు దశాబ్దాల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్ ముఖర్జీకి ప్రత్యేక స్థానం ఉంది.