/rtv/media/media_files/2025/05/07/lw1BFshHcaCddacVfDn7.jpg)
Operation Sindoor
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత ప్రభుత్వం పాక్ పై అన్ని రకాలుగా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం కూడా జరగవచ్చని చెప్పింది. నిన్న అర్థరాత్రి 1.00 గంటలకు ఆపరేషన్ సింధూ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం మెరుదాడి చేసింది. మిస్సైల్స్ తో విరుచుకుపడింది. మురిద్కే, బహవల్పూర్, కోట్లి, గుల్పూర్, భింబర్, చక్ అమ్రు, సియాల్కోట్ , ముజఫరాబాద్‌లలో దాడులు నిర్వహించింది. ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. ఇప్పటి వరకు 90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.
1971 తర్వాత ఇదే మొదటిసారి..
అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూ...1971లో జరిగిన భారత, పాకిస్తాన్ యుద్ధాన్ని తలిస్తోందని అంటున్నారు. దీనికి కారణం త్రివిధ దళాలు కలిపి అటాక్ చేయడమే అని చెబుతున్నారు. 1971 తర్వాత భారత్-పాక్ లమధ్య కార్గిల్ వార్ జరిగింది. ఆ తర్వాత కూడా పుల్వామా దాడికి ప్రతీకార చర్య, యురి లాంటివి నిర్వహించింది భారత్. అయితే వీటన్నింటిలో భారత సైన్యానికి చెందిన త్రివిధ దళాలు పాల్గొనలేదు. కానీ ఇప్పుడు నిర్వహించిన ఆపరేషన్ సింధూలో మాత్రం భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అన్నీ కలిపి అటాక్ చేశాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర లో తొమ్మిది ప్రదేశాలపై దాడులు నిర్వహించాయి. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళాలకు చెందిన ప్రెసిషన్ స్ట్రైక్ ఆయుధ వ్యవస్థలను ఉపయోగించారని తెలిపారు. అయితే ఈ అటాక్ లో పాక్ సైన్యాన్ని మాత్రం లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేశామని చెప్పింది భారత ఆర్మీ. ఈ మొత్తం ఆపరేషన్ ను భారత ప్రధాని మోదీ వార్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
today-latest-news-in-telugu | indian defense forces
Also Read: OPERATION SINDOOR: దాడి కోసం బహవల్‌పూర్ నే భారత్ ఎందుకు ఎంచుకుందో తెలుసా?