/rtv/media/media_files/2025/05/07/E6tI0U21tXab1u5RCU2x.jpg)
Operation Sindoor
బహవల్ పూర్...పాకిస్తాన్ లో తి ముఖ్యమైన ప్రాంతాల్లో ఇది ఒకటి. దీనిపై నిన్న రాత్రి భారత ఆర్మీ విరుచుకుపడింది. మిస్సైల్స్ తో మెరుపు దాడి చేసింది. బహవల్ నగరం లాహోర్ నుంచి 400 కి.మీ దూరంలో ఉంది. పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను మట్టు బెట్టడానికి ఇండియన్ ఆర్మీ ఈ స్థావరాన్నే ఎంచుకుంది. దీని వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. బహవల్ పూర్ ఎప్పటి నుంచో జైష్ ఎ మహ్మద్ కు బలమైన స్థావరంగా ఉంది. ఇది జె.ఇ.ఎం ప్రధాన కార్యాలయం ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలువబడే 'జామియా మసీదు సుభాన్ అల్లా' కాంప్లెక్స్‌లో ఉంది. జైషే మహ్మద్ ఇక్కడ మొత్తం 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. జెఎం నియామకాలు, నిధులు, శిక్షణకు కేంద్రంగా ఉంది. అలాగే జెఎం వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ బహవల్పూర్ లో అత్యంత భద్రత కలిగిన కాంప్లెక్స్ లో ఉంటున్నాడు. అలాగే లష్కరే తోయిబా లాంటి జీహాదీ స్థావరాలకు కూడా బహవల్ పూర్ కేంద్రంగా ఉంది.
పాకిస్తాన్ లో జైష్ ఎ మహ్మద్ ను 2022లో నిషేధించారు. కానీ అది కాగితాల వరకే పరిమితమైంది. దీన్ని పాక్ ప్రభుత్వం కూడా చూసీ చూడనట్టు వదిలేసింది. దీంతో ఆ సంస్థ తన శిబిరాన్ని నిర్వహించడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇక బహవల్ పూర్ లో రహస్య అణు స్థావరం కూడా ఉందని చెబుతున్నారు. దీనికి దగ్గరలోనే జేఎం ఉండడం...ఆ సంస్థకు ఐఎస్ఐ మద్దతిస్తోందన్న దానికి అతి పెద్ద నిదర్శనమని అంటున్నారు. మదర్సాగా ముసుగు వేసుకున్న మసీదులో జైష్ ఎ మహ్మద్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ మసీదుకు జెఎం అనుబంధ సంస్థ అయిన అల్-రెహమత్ ట్రస్ట్ నిధులు సమకూరుస్తోంది. 2011 వరకు ఇది ఒక సాధారణ భవనం, కానీ 2012 నాటికి దీనిని ఒక పెద్ద శిక్షణా కేంద్రంగా మార్చారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, గుర్రాల శాల, జిమ్ లాంటివి కూడా ఉన్నాయి.
జైష్ ఎ మహ్మద్ చేసిన దాడులు..
ఏప్రిల్ 2000: శ్రీనగర్‌లోని బాదామి బాగ్‌లో మొదటి ఆత్మాహుతి దాడి, నలుగురు సైనికులు అమరులయ్యారు.
అక్టోబర్ 2001: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, 30 మందికి పైగా మృతి.
డిసెంబర్ 2001: పార్లమెంటుపై దాడి, 14 మంది మరణం.
జనవరి 2016: పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, ముగ్గురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు.
సెప్టెంబర్ 2016: ఉరి దాడి, 19 మంది భారత సైనికులు అమరులయ్యారు.
ఫిబ్రవరి 2019: పుల్వామా దాడి, 40 మంది CRPF సైనికులు అమరులయ్యారు.
2024-25: పహల్గామ్ దాడిలో జెఎం సహాయక విభాగం ప్రమేయం
మసూద్ అజార్ ఎవరు..
1968లో పుట్టిన మసూద్ అజార్ జైష్ ఎ మహ్మద్ వ్యవస్థాపకుడు. 2019లో ఐక్యరాజ్యసమితి ద్వారా ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. 1994లో భారతదేశంలో అరెస్టయ్యాడు. అంతకు ముందు అతను ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ సభ్యుడు, మతాధికారి. జైలు నుంచి విడుదల అయ్యాక మసూద్ అజార్ జైష్-ఎ-మొహమ్మద్ ను స్థాపించాడు. ఈ సంస్థ రాడికల్ ఇస్లామిక్ భావజాలాన్ని ప్రేరేపిస్తుంది. 2000 తర్వాత భారతదేశంలో జెఎం, మిగతా ఉగ్రవాద సంస్థలతో కలిసి అనేక దాడులు చేసింది. ఇందులో భారత్ లోని వాటిలో జమ్మూ కాశ్మీర్ శాసనసభ, భారత పార్లమెంటుపై దాడులు కూడా ఉన్నాయి. 1999 డిసెంబర్ 24న, ఐదుగురు హర్కత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాదులు 190 మంది ప్రయాణికులు , సిబ్బందితో వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. ఖాట్మండు నుండి ఢిల్లీకి వెళుతున్న ఫ్లైట్ ను అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్ కి తీసుకెళ్లారు. భారతదేశం ముగ్గురు ఉగ్రవాదులను - మసూద్ అజార్, ఒమర్ షేక్, ముష్తాక్ జర్గర్ అనే ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేశాక విమానాన్ని రిలీజ్ చేశారు. మసూద్ అజార్ తర్వాత జేఎం లో అతని సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. వీరి తర్వాత షా నవాజ్ ఖాన్ (సజ్జిద్ జిహాదీ), మౌలానా ముఫ్తీ మొహమ్మద్.. 300 మందికి పైగా ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ఇతర కీలక నాయకులుగా ఉన్నారు.
today-latest-news-in-telugu | pakistan | Indian Army | attacks