IndiGo: కేంద్రం సంచలన నిర్ణయం.. మారిన విమాన టికెట్ ధరలు

ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.

New Update
IndiGo

ఇండిగో విమాన సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇతర విమానయాన సంస్థలు ఈ పరిస్థితిని ఆసరగా చేసుకుని విపరీతంగా టికెట్ ధరలు పెంచేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు విమానాలకు అధిక ధరలు చెల్లిస్తున్నామని పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగింది. ప్రయాణికులకు అధిక ఛార్జీల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Also Read: గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికలు...నగరవాసుల కోసం వేట

IndiGo Ticket Rates Changed

తాజాగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ధరలను ప్రకటించింది. వాటిని అన్ని విమానయాన సంస్థలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎకానమీ క్లాస్‌లో 500కి.మీ వరకు ప్రయాణిస్తే - రూ.7,500, 500-1000 కి.మీ  రూ.12,000, 1000-1500కి.మీ - రూ.15,000, 1500కి.మీ.దాటితే - రూ.18,000 ఛార్జీలు విధించింది. ఈ రూల్స్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత ఈ ప్రకటన జారీ అయ్యింది. 

Also Read :  భారత్-రష్యా మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే.. !

Advertisment
తాజా కథనాలు