/rtv/media/media_files/2025/12/06/indigo-2025-12-06-17-05-22.jpg)
Centre Planning Big IndiGo Crackdown, Likely To Seek CEO Pieter Elbers' Removal
పైలట్లు, సిబ్బంది విశ్రాంతి సమయాన్ని పెంచడంతో ఇండిగో(indigo) విమాన సంస్థలో కొనసాగుతున్న అంతరాయం అయిదో రోజుకు చేరింది. వేలాది విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే విమానాల సర్వీసులను వేగంగా పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) శనివారం రంగంలోకి దిగింది. ప్రధాని మోదీ కూడా ఇండిగో సంక్షోభం గురించి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.
Also Read: భారత్-రష్యా మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే.. !
CEO Pieter Elbers' Removal
ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్(Pieter Elbers) తో పీఎంఓ అధికారులు ప్రత్యక్షంగా చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు ఆదివారం రాత్రి 8 గంటల వరకు ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే విమాన టికెట్ ధరలు పెరగడంపై చర్యలకు దిగింది. ఛార్జీలపై పరిమితులు విధించింది. శనివారం దాదాపు 400 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దు, ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు, సిబ్బంది మధ్య వాగ్వాదాలు జరిగిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: భగవద్గీత, అస్సాం టీ, వెండి గుర్రం.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన విలువైన బహుమతులు ఇవే !
ఇండిగో విమానాలకు అంతరాయం ఏర్పడటంతో శుక్రవారం ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలసిందే. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి తాము క్షమాపణలు చెబుతున్నానని.. వీలైనంత వేగంగా విమానాల సర్వీసులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఇండిగో సంస్థపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను కేంద్రం తొలగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: కూల్చివేత నుండి రామాలయం నిర్మాణం వరకు... అయోధ్యలో బాబ్రీమసీదు కూల్చివేతకు 33 ఏళ్లు
Follow Us