Live Suicide Video: లైవ్ సూసైడ్.. చెట్టుకు ఉరేసుకున్న యువతి (వీడియో)

ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. ఒక యువకుడు వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి అందరూ చూస్తుండగానే చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే ఓ వ్యక్తి ఆమె వద్దకు వెళ్లి రక్షించాడు. వీడియో వైరల్‌గా మారింది.

New Update
Live Suicide Video

Live Suicide Video

భారతదేశంలో క్రైమ్ రేట్ రోజు రోజుకూ పెరిగిపోతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికల ప్రకారం.. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసులలో యువతులు లేదా మహిళలు తమ భాగస్వామి తమను మోసం చేశారని, ప్రేమించినట్లు నటించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వేధించారని ఆరోపించినట్లు నమోదయ్యాయి. కొన్నిసార్లు తమ భాగస్వామి నిజంగానే ప్రేమలో ఉన్నారని నమ్మి మహిళలు శారీరక సంబంధానికి అంగీకరిస్తారు. కానీ ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినప్పుడు.. సూసైడ్ చేసుకోవడం వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ పేరుతో మోసం చేసి, లైంగిక సంబంధం పెట్టుకుని ఆ తర్వాత ముఖం చాటేసే ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. 

Live Suicide Video

తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు నెలల తరబడి తనను ప్రేమించినట్లు నమ్మించాడని.. వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ యువతి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అందరూ చూస్తుండగానే చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది. కొందరు ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో రికార్డు చేయగా.. మరొక వ్యక్తి వెళ్లి రక్షించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఈ దారుణమైన ఘటన ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. సురేంద్ర కుమార్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఓ యువతితో ప్రేమను కొనసాగిస్తున్నాడు. ఆమెకు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మాయమాటలు చెప్పాడు. అక్కడితో ఆగకుండా పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడు. చివరికి ఆ యువకుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి అందరిముందే ఊరి చివర చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. 

అందరూ చూస్తుండగానే చెట్టుకు చీరకట్టి ఊరేసుకుంది. అయితే అక్కడ ఉన్న కొందరు ఆ దృశ్యాన్ని చూస్తూ ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఒక వ్యక్తి మాత్రం పరిగెత్తుకొని వెళ్లి ఆ యువతిని కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఆరోపించిన వ్యక్తి గత కొన్ని నెలలుగా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. అతను ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుమార్లు శారీరకంగా లొంగదీసుకున్నాడని ఆమె ఆరోపించింది. అయితే, చివరికి అతను పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది అని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం నిందితుడు సురేంద్ర కుమార్ యాదవ్‌ను అరెస్టు చేశారు. 

Advertisment
తాజా కథనాలు