Tamil Nadu Ban : తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం

స్టాలిన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ మూవీస్ బ్యాన్ కు స్టాలిన్ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా హిందీ భాషా హోర్డింగ్‌లు,  హిందీ సినిమాలు, హిందీ పాటలపై నిషేధం విధించే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.

New Update
CM Stalin

CM Stalin

తమిళనాడులో హిందీ భాషా వివాదం మరో కీలక మలుపు తిరిగింది. అక్కడి స్టాలిన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ మూవీస్ బ్యాన్ కు స్టాలిన్ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా హిందీ భాషా హోర్డింగ్‌లు,  హిందీ సినిమాలు, హిందీ పాటలపై నిషేధం విధించే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ, తమిళ భాష,  సంస్కృతిని పరిరక్షించుకోవడంలో భాగంగానే డీఎంకే ప్రభుత్వం ఈ చట్టపరమైన చర్యకు సిద్ధమవుతున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ బిల్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఉంటుందని, రాజ్యాంగంలోని అధికరణ 343-351 ప్రకారం ఇంగ్లీషును సహ-అధికారిక భాషగా కొనసాగించే విధానానికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సీఎం స్టాలిన్ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ మధ్య మరో తీవ్ర వివాదానికి దారితీసే అవకాశం ఉంది. 

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్టాలిన్

కాగా తమిళనాడు ప్రభుత్వం గత ఆరు దశాబ్దాలుగా అమలు చేస్తున్న ద్విభాషా విధానం (తమిళం, ఇంగ్లీష్) ను కాపాడుకోవాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా కేంద్రం త్రిభాషా విధానాన్ని మూడో భాషగా హిందీని అమలు చేయడాన్ని సీఎం స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  

ఈ ఏడాది ప్రారంభంలో, తమిళనాడు ప్రభుత్వం తన రాష్ట్ర బడ్జెట్ లోగోగా అధికారిక భారత రూపాయి చిహ్నం '₹' స్థానంలో తమిళ అక్షరం 'ரூ' ను ఉంచింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి విద్యలో భాషా విధానంపై చర్చలు కొనసాగుతున్నాయి. 1948-49లో రాధాకృష్ణన్ కమిషన్ అంతర్-ప్రాంతీయ అవగాహనను ప్రోత్సహించడానికి మొదట మూడు భాషల సూత్రాన్ని ప్రతిపాదించింది.  

Advertisment
తాజా కథనాలు