Air India Flight Crash: విమాన ప్రమాదం పక్కా ప్లాన్.. ఎవరిదంటే?

ఫ్లైట్ ఇంజన్‌కు ఫ్యూయల్ అందించే స్విచ్‌లు ఆటోమేటిక్‌గా స్విచాఫ్‌ కావని వైమానిక భద్రతా నిపుణుడు మోహన్‌ రంగనాథన్‌ అంటున్నారు. ఉద్దేశపూర్వక మానవ చర్య కారణంగానే ఎయిరిండియా ఫ్లైట్‌ 171 కూలిపోయి ఉండవచ్చునని కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్‌ చెప్పారు. 

New Update
Air india 132354

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొత్త అనుమానం రేకెత్తుతోంది. ఈ ఫ్లైట్ క్రాష్‌లో 272 మంది మరణించిన విషయం తెలిసిందే. ఫ్లైట్ గాల్లోకి టేకాఫ్ అయ్యాక ఇంజన్‌కు ఇందన సరఫరా ఆగిపోయిందని ప్రాథమిక నివేదికలో తెలుస్తోంది. అయితే.. ఇంధనం కటాఫ్‌ స్విచ్‌లు ఆటోమేటిక్‌గా స్విచాఫ్‌ కావని వైమానిక భద్రతా నిపుణుడు మోహన్‌ రంగనాథన్‌ అంటున్నారు. తప్పులను కప్పిపుచ్చే విధంగా ప్రాథమిక నివేదిక లోపాలతో ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వక మానవ చర్య కారణంగానే ఎయిరిండియా ఫ్లైట్‌ 171 కూలిపోయి ఉండవచ్చునని కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్‌ చెప్పారు. 

Also Read :  వెకేషన్ లో రుహనీ గ్లామర్ షో.. ఫొటోలు భలే ఉన్నాయి!

Air India Flight Crash

ఇది ఒకరకమైన సూసైడ్ బాంబర్ లాంటి చర్య అని ఆయన అంచనా వేశారు. ఫ్యూయల్‌ కటాఫ్‌ స్విచ్‌ల అమరిక, కాక్‌పిట్‌ ఆడియోను పరిశీలించినపుడు పలు అనుమానాలు వస్తున్నట్లు తెలిపారు. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు వాటంతట అవి ఆఫ్ కావు, పైలట్లు ఎవరైనా ఆఫ్ చేసి ఉండొచ్చని ఆయన చెప్పారు. ఇవి తమంతట తాము ఆటోమేటిక్‌గా స్విచాఫ్‌ కావన్నారు. విద్యుత్తు సరఫరా విఫలమైనప్పటికీ ఇవి స్విచాఫ్‌ కావని చెప్పారు. ఇవి జారిపోయే తరహా స్విచ్‌లు కాదని తెలిపారు. ఒక స్లాట్‌లో కదలకుండా ఉండేలా వీటిని డిజైన్‌ చేసినట్లు చెప్పారు. వీటిని పైకి లేదా కిందకు కదిలించాలంటే, వాటిని పట్టుకుని కదిలించవలసి ఉంటుందని తెలిపారు. అకస్మాత్తుగా ‘ఆఫ్‌’ పొజిషన్‌కు రావడమనేది ఎంత మాత్రం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇది ఓ వ్యక్తి వాటిని ‘ఆఫ్‌’ పొజిషన్‌కు మార్చాలని ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసుకున్న కచ్చితమైన సందర్భమని వివరించారు.

Also Read :  కూల్ వెదర్‌లో తన అందాలతో హీట్ పెంచుతున్న సాక్షి మాలిక్.. ఫొటోలు చూస్తే పిచ్చెక్కల్సిందే!

Also Read :  విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్

ఈ విమానంలోని కెప్టెన్‌ కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు తనకు కొందరు చెప్పారని తెలిపారు. ప్రమాద నివేదికలో లోపాలు కనిపిస్తున్నాయని, దాదాపు కప్పిపుచ్చే ప్రయత్నంలాగా ఉందని అన్నారు. విమానం బయల్దేరేటపుడు, కిందకు దిగేటపుడు పైలట్లు హెడ్‌ఫోన్స్‌ను పెట్టుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఆడియో క్యామ్‌ 1 (కెప్టెన్‌) నుంచి వస్తున్నదా? క్యామ్‌ 2 (కో-పైలట్‌) నుంచి వస్తున్నదా? అనే విషయం కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ స్పష్టంగా వెల్లడిస్తుందని చెప్పారు. అస్పష్టమైన పదాలను వాడటం తప్పు దోవ పట్టించేదిగా కనిపిస్తున్నదన్నారు. ఈ చర్య ఉద్దేశపూర్వకమైనదని, అందుకే తాను ఫ్యూయల్‌ స్విచ్‌లను ఆఫ్‌ చేయడం మాన్యువల్‌గానే జరిగిందని చెప్తున్నానని వివరించారు. ఈ విమానం సిబ్బందిలో ఒకరు కొంత కాలంపాటు వైద్యపరమైన కారణాల మేరకు సెలవు తీసుకున్నారని తనకు కొందరు ఎయిరిండియా పైలట్లు చెప్పారని తెలిపారు. ఈ విషయం చాలా మంది లైన్‌ పైలట్లకు తెలుసునని, అటువంటపుడు ఎయిరిండియా టాప్‌ మేనేజ్‌మెంట్‌కు దీని గురించి తెలియనట్లయితే, ఆశ్చర్యకరమేనని మోహన్ రంగనాథన్ చెప్పారు.

Also Read :  స్పెయిన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వందల మందికిపైగా గల్లంతు

flight crash reasons | pilot-dead | pilot last words | air india pilot | air india flight landing issue | Air India Flight Trichy | air india flight crash in ahmedabad | air india flight crash in gujarat | air india flight crash

Advertisment
Advertisment
తాజా కథనాలు