Prajwal Revanna : అత్యాచారం కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బిగ్ షాక్ తగిలింది. అత్యాచారం కేసులో బెంగుళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించింది. ఇప్పటివరకు ఆయనపై నమోదైన మొత్తం నాలుగు అత్యాచార కేసుల్లో మొదటి కేసు కావడం గమనార్హం.