Agniveer: కేంద్రం కీలక నిర్ణయం.. అగ్నివీరుల కోటా పెంపు

కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుళ్ల నియామకాల కోటాను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో 10 శాతం ఉన్న అగ్నివీరుల కోటాను 50 శాతానికి పెంచినట్లు పేర్కొంది.

New Update
Agniveer

Agniveer

కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (BSF) కానిస్టేబుళ్ల నియామకాల కోటాను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో 10 శాతం ఉన్న అగ్నివీరుల కోటాను 50 శాతానికి పెంచినట్లు పేర్కొంది. మొదటి దశలో మాజీ అగ్నివీరులకు కేటాయించిన 50 శాతం ఖాళీలకు, రెండో దశలో మాజీ అగ్నివీరులు కాకుండా మిగిలిన ఖాళీలకు నియామకాలు చేపడతామని వెల్లడించింది. మొదటి దశలో ఒక నిర్దిష్ట విభాగంలో మాజీ అగ్నివీరులతో కాకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. 

Also Read: తెలంగాణను గజ గజ వణికిస్తున్న చలి.. మరో మూడు రోజుల పాటు ఈ జిల్లాల ప్రజలకు చుక్కలే!

2022 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అగ్నివీరులుగా వాళ్లు నాలుగేళ్ల పాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఆ కాలపరిధి ముగిసిన తర్వాత రిజర్వేషన్ ఆధారంగా కేంద్ర పారామిలటరీ బలగాల్లో వాళ్లని నియమించుకుంటారు. ఈ ప్రక్రియలో భాగంగానే గతంలో అన్ని కేంద్ర సాయుధ పోలీసు దళాల్లోని కానిస్టేబుల్ ఖాళీల్లో అగ్నివీరులకు 10 శాతం రిజర్వేషన్ కేటాయించారు.

Also Read: యువతకు ఐబీఎం బంపరాఫర్.. ఏఐలో 50 లక్షల మందికి ఉద్యోగాలు

అయితే తాజాగా కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో కేవలం బీఎస్‌ఎఫ్‌ నియామకాల్లో మాత్రమే అగ్నివీరుల రిజర్వేషన్‌ను 10 నుంచి 50 శాతానికి పెంచారు. ప్రస్తుత రూల్స్‌ ప్రకారం మాజీ అగ్నివీరులకు శారీరక సామర్థ్య పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ రాత పరీక్షల్లో మాత్రం ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.  

Also Read: ప్రయాణికుడిపై పైలట్ దాడి.. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన ఎయిరిండియా

Advertisment
తాజా కథనాలు