/rtv/media/media_files/2024/11/25/W7BpQFKaVOKNaAo3TAq5.jpg)
Maharshtra: మహారాష్ట్రలో అధికార పంపిణీపై ఢిల్లీలో కసరత్తులు మొదలయ్యాయి. గురువారం రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మహాయుతి నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సమావేశమయ్యారు. మంత్రివర్గ కూర్పుపై దాదాపు గంట సేపు అమిత్ షాతో చర్చించినట్లు తెలిపారు
Also Read: PASSPORT: రెండు రోజుల్లోనే పాస్‌పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి
ఈ క్రమంలో ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను బీజేపీ నేత ఫడణవీస్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అంతకుముందు శివసేన నేత ఏక్‌నాథ్ షిండేతో అమిత్ షా ఏకాంతంగా మీటింగ్ అయ్యారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం చాలా బాగా, పాజిటివ్‌గా జరిగిందనని ఏక్‌నాథ్ చెప్పారు.
Also Read: దారుణం జననాంగాల్లో కారం.. నర్సుపై సామూహిక అత్యాచారం
ఇది మొదటి సమావేశం అని, మరో మీటింగ్ ఉంటుందని అన్నారు. ముంబైలో జరిగే ఆ సమావేశంలో మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో మహారాష్ట్రలోని సామాజిక సమీకరణలను బీజేపీ అధిష్ఠానం బేరీజు వేస్తున్నట్లు సమాచారం. ఓబీసీ, మరాఠా వర్గాలకు చెందిన నేతల పేర్లనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు!
బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఫడణవీస్ సీఎం రేస్‌లో ముందున్నా- బీజేపీ అధిష్ఠానం మరో ఆలోచనపై కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ తిరస్కరించినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
అలాగే కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. మరోవైపు ఆయనకు కేంద్ర కేబినెట్ బెర్త్ కూడా ఆఫర్ చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షిండే అర్బన్, డెవలప్‌మెంట్ శాఖ అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఈ పదవి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.డిసెంబర్ 2న కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కూటమి నేతలు అంటున్నారు.
Also Read: ప్రయాణించే రైళ్లు ఆలస్యంగా వెళ్తే నష్టపరిహారం పొందొచ్చు.. ఎలాగంటే?