/rtv/media/media_files/2024/10/20/4RJCIriK1mZYdnNkyr6t.jpg)
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జలౌన్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడగా.. మరో నలుగురు ఆమెను పట్టుకున్నారు. స్కూటీపై డ్యూటీకి వెళ్తున్న ఆమెను మార్గ మధ్యలోనే ఆపేసి.. పొదళ్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఇది కూడా చూడండి: Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు
ప్రైవేట్ పార్ట్స్‌లో కారం పొడి చల్లి..
ఇక్కడితో ఆగకుండా ఆ మహిళ జననాంగాల్లో కారం పొడి చల్లడంతో పాటు కర్రను చొప్పించారు. వెంటనే ఆ మహిళ తన భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో మహిళలకు అక్రమ సంబంధం ఉందని, వారి కుటుంబ సభ్యులే ఇలా చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇది కూడా చూడండి: Instant Coffee: ఇన్‌స్టాంట్ కాఫీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
ఇదిలా ఉండగా.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో 16 ఏళ్ల బాలికను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం చేశారు. ఈ నెల 25న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు దుండగులు వీరేంద్ర చతుర్వేది, రాజేష్ కేతవ్.. 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేయడానికి బలవంతంగా ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించారు.
ఇది కూడా చూడండి: గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా లిరికల్ సాంగ్ రిలీజ్
ఆ తర్వాత అంబులెన్స్ కదులుతుండగానే ఒకరి తర్వాత మరొకరు బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను ఎవరూ లేని చోట వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఆ బాలిక అక్కడే కాసేపు కూర్చుని ఏడ్చింది. ఆ తర్వాత అత్యాచారం నుంచి తేరుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: ఏపీని భయపెట్టిస్తున్న తుపాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్