PASSPORT: రెండు రోజుల్లోనే పాస్‌పోర్ట్ కావాలా? అయితే,వెంటనే ఇలా చేయండి హైదరాబాద్ లోని మూడు పాస్‌పోర్టు సేవాకేంద్రల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పాస్‌పోర్టు అధికారులు సూచిస్తున్నారు. By Bhavana 29 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Passport: హైదరాబాద్ లోని మూడు పాస్‌పోర్టు సేవాకేంద్రల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేంద్రాల సేవలను వినియోగించుకోవాలని పాస్‌పోర్టు అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తుదారులు ఎక్కువగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట, బేగంపేట, టోలిచౌకి కేంద్రాలనే ఎంచుకుంటున్నారని, దాంతో వాటిపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని వివరించారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా దరఖాస్తుదారులు పాస్‌పోర్టు స్లాట్ బుక్ చేసుకునేలా విదేశీ వ్యవహారాల శాఖ వెసులుబాటు కల్పించిందని వివరించారు. Also Read: Ap News: ఈగల్ వచ్చేస్తుంది..ఇక వారికి దబిడి దిబిడే! పాస్‌పోర్టు విధానం పై అవగాహన లేక చాలా మంది జిల్లావాసులు హైదరాబాద్‌లోని కేంద్రాలనే ఎంచుకుంటుండటంతో చాలా ఆలస్యమవుతుంది. దరఖాస్తుదారులు తమకు అతి సమీపంలో ఉండే పీఎస్కే లేదా పీవోపీఎస్కే(పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రా)లను ఎంచుకుంటే ప్రక్రియ మరింత స్పీడ్ గా పూర్తి అవుతుందని అధికారులు సూచిస్తున్నారు. Also Read: Telangana: పంచాయతీ ఎన్నికలపై సర్కార్ కీలక నిర్ణయం! తాజా జాబితా ప్రకారం కరీంనగర్ పీఎస్కేలో పాస్‌పోర్టు అపాయింట్మెంట్కు 13 రోజులు, అమీర్‌పేట, బేగంపేటలో స్లాట్ లభించడానికి 15 రోజులు, టోలిచౌకిలో 20 రోజులు సమయం పట్టేస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని పీఎస్కేలో సాధారణ, తత్కాల్ అపాయింట్మెంట్కు ఒక్కరోజే తేడా ఉంటుంది. నల్గొండ పీవోపీఎస్కేలో దరఖాస్తు చేసిన తర్వాతి రోజు వెంటనే అపాయింట్మెంట్ లభిస్తోంది. Also Read: Rain Alert : ఏపీకి తప్పిన తుపాను ముప్పు..ఈరోజు, రేపు భారీ వర్షాలు! మేడ్చల్‌తో పాటు నల్గొండ, వికారాబాద్‌లో 80 స్లాట్లు, వరంగల్‌లో 120, మహబూబాబాద్, భువనగిరి, మంచిర్యాల, ఖమ్మం, కామారెడ్డి,మెదక్, సిద్దిపేట, వనపర్తి ఆదిలాబాద్, , మహబూబ్‌నగర్, జిల్లాల్లోని పీవోపీఎస్కేల్లో 40 సాధారణ అపాయింట్మెంట్లు విడుదలవుతున్నాయి. అవి కేవలం ఒకటి నుంచి రెండ్రోజుల్లోనే వస్తున్నాయి. Also Read: తెలంగాణకు కేంద్రం మరో తీపి కబురు.. అక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 82వ స్థానంలో... ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాల జాబితాను గతంలో హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది. ఇంటర్నేషనల్ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో భారత్ పాస్‌పోర్ట్ 82వ స్థానంలో నిలిచింది. ఇందులో గతంతో (2023) పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగు పడింది. #telangana #passport #PSK #POPSK మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి