/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t094044460-2025-11-04-09-41-22.jpg)
Encounter in Coimbatore.. Three accused arrested
కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని(collage students) ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి(rape) పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు.
తమిళనాడు(tamilnadu) రాష్ట్రం కోయంబత్తూరులో నవంబర్ 2న అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక బృందావన్ నగర్ ప్రాంతంలో 20 ఏళ్ల పీజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు అపహరించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో కోయంబత్తూరు పోలీసులు వెంటనే ఏడు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
Also Read : సీరియల్ నటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..
Encounter In Coimbatore
ఆదివారం రాత్రి యువతి తన బాయ్​ఫ్రెండ్‌తో కలిసి కారులో బయటకు వచ్చింది. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏరియాలో కారును ఆపి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో అక్కడికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. కారును చుట్టుముట్టారు. బాయ్ ఫ్రెండ్‌ను ఇష్టమొచ్చినట్టుగా కొట్టి, యువతిని బలవంతంగా కారులోంచి లాగి మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బాధితురాలిని రోడ్డుపై వదిలేసి నిందితులు పారిపోయారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు.. సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నిందితులు తుడియాలూరుకు సమీపంలోని వలంకినార్‌లోని తేడియాలూరు ఆలయం సమీపంలో ఉన్నారని సమాచారం అందింది. వెంటనే ఆలయాన్ని పోలీసులు చుట్టుముట్టారు. అయితే నిందితులు గుణ, కరుప్పసామి, కాలీశ్వరన్‌ను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ ప్రయత్నించగా..నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు కొడవలితో దాడి చేశారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారి కాళ్లపై కాల్పులు(Encounter In Coimbatore) జరిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు. కొడవలి దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చంద్రశేఖర్‌ను చికిత్స నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ (CMCH)కి తరలించారు. అయితే, ఇప్పటికే నిందితులపై హత్య, దోపిడీతో మొత్తం 5 కేసులో నిందితులుగా ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ శరవణ సుందర్ నిందితుల అరెస్టును ధృవీకరించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితుల కాళ్లపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని శరవణ సుందర్ పేర్కొన్నారు. ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్‌లను కోయంబత్తూరు ​ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ తెలిపారు.
Also Read : నిత్యం నరకం అనుభవిస్తున్నా... ఎయిర్ ఇండియా ప్రయాదంలో బతికిన వ్యక్తి ఆవేదన
Follow Us