Bihar Assembly Elections 2025: బిహార్‌ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదల చేసింది.

New Update
Bihar Assembly Elections Schedule

Bihar Assembly Elections Schedule

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల(bihar-assembly-elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదల చేసింది. రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలో నవంబర్‌ 6న, రెండో దశలో నవంబర్‌ 11న ఎన్నికలు జరగనున్నాయి. 14 న ఓట్ల లెక్కింపు జరగనుంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ  ''ఎన్నికల ప్రక్రియను మరింత సులభతం చేస్తున్నాం. నామినేషన్లకు 10 రోజుల ముందు కూడా ఓటరు జాబితాలో మార్పులు చేసుకోవచ్చు. రాష్ట్రంలో 14 లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు. 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం.100 శాతం వెబ్‌కాస్టింగ్ జరగనుంది. మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 3.92 కోట్లు, స్త్రీలు 3.5 కోట్లు.

Also Read: సుప్రీం కోర్టులో హై టెన్షన్.. న్యాయవాది CJIపై చెప్పులు విసిరేందుకు యత్నం!

EC Released Bihar Assembly Elections 2025 Schedule

243 స్థానాల్లో ఎస్సీ స్థానాలకు 38, ఎస్టీ స్థానాలు 2 సీట్లు కేటాయించాం.  వందేళ్లకు పైబడిన ఓటర్లు 14 వేల మంది ఉన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. బిహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 రకాల సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రతి పోలింగ్ బూత్‌లో 1200లకు మించి ఉండరాదు. ఇకనుంచి ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయి.  ఎలాంటి ఫిర్యాదులకైన ఓటర్లు 1950 నెంబర్‌కు డయల్ చేయొచ్చుని'' పేర్కొన్నారు. 

బీహార్ ఫస్ట్‌ ఫేజ్ ఎన్నికల గెజిట్‌ నోటిఫికేషన్ అక్టోబర్‌ 10న రానుంది. నామినేషన్ల దరఖాస్తుకు అక్టోబర్ 17 చివరి తేదీగా నిర్ణయించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు అక్టోబర్ 20 తో ముగుస్తుంది. నవంబర్‌ 6న మొదటి దశ పోలింగ్ జరగనుంది. రెండో విడుత ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్ అక్టోబర్ 13న రీలీజ్ చేయనున్నారు. దరఖాస్తులకు అక్టోబర్‌ 20 చివరి తేదీ. రెండో దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. 

Also Read: ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది పర్వతారోహకులు

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ బృందం ఇటీవల రెండ్రోజులు బిహార్‌లో పర్యటించింది. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే నెల చివరివారంలో అసెంబ్లీ గడువు ముగియనుంది. నవంబర్ 22వ తేదీకి ముందే పోలింగ్ నిర్వహిస్తామని  సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు