ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ద రామయ్యకు ED షాక్

కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు ముడా స్కామ్‌లో ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన సతీమణికి చెందిన రూ.300 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ కింద పార్వతమ్మ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు జవవరి 17న ఈడీ ప్రకటించింది.

New Update
Siddaramaiah 2

కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారిన ముడా స్కామ్‌లో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభ కోణంలో సీఎం సిద్ధ రామయ్య సతీమణికి చెందిన దాదాపు రూ.300 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు చెందిన 142 ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు జవవరి17న ఈడీ ప్రకటించింది.

ఇది కూడా చదవండి : కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ సెక్యూరిటీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్

 పార్వతమ్మ పేర ఉన్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్​అర్బన్​డెవలప్​మెంట్​అథారిటీ (ముడా) సేకరించింది. దీంతో ముడా ఆమెకు వేరే చోట భూమి కేటాయించింది. సిద్ధ రామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఇదంతా జరిగింది. దీంతో సీఎం సిద్ధ రామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్‎కు ఫిర్యాదు చేశారు.

Also Read: బాబా సజీవ సమాధి తవ్వకుండా అడ్డుకున్న ఫ్యామిలీ.. పోలీసుల విచారణలో బిగ్ ట్విస్ట్

దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధ రామయ్య, ఆయన సతీమణి పార్వతమ్మ, మరి కొందరిపై లోకాయుత్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముడా స్కామ్‌లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ.. లోకాయుత్త పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు  చేసింది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధ రామయ్య ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 

Also Read: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ

Advertisment
తాజా కథనాలు