/rtv/media/media_files/2025/07/24/ed-searches-anil-ambans-companies-2025-07-24-11-52-29.jpg)
ED searches Anil Ambani's companies
Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కి చెందిన కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబయిలోని అంబానీకి చెందిన అన్ని కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అంబానీకి చెందిన సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. అనిల్ కు చెందిన కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. రూ.3వేల కోట్ల రుణాలకు సంబంధించి వివరాలు సేకరిస్తోంది.
Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
ఎస్‌బీఐ షాక్
పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ సహా ఆయన కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు (RCom) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద షాక్ ఇచ్చింది. అంబానీని, ఆర్‌కామ్‌ను ఫ్రాడ్‌గా వర్గీకరించింది. దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అంబానీ సంస్థ.. ఎస్బీఐకి రూ. 2 వేల కోట్లకుపైగా బకాయి ఉంది. ఆర్‌కామ్, అనిల్ అంబానీని 2025, జూన్ 13న ఫ్రాడ్‌గా వర్గీకరించినట్లు ఎస్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 'ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్' నిబంధనలు, బ్యాంక్ బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం ఇది జరిగిందని వెల్లడించింది. ఇక జూన్ 24న దీనిని ఆర్బీఐకి తెలిపింది. ఇక జులై 1నే ఆర్‌కామ్.. ఈ ఫ్రాడ్ వర్గీకరణ గురించి స్టాక్ ఎక్స్చేంజీకి తెలిపింది. ఎస్‌బీఐ.. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు రూ. 2,227.64 కోట్ల లోన్ ఇచ్చింది. దీనికి 2016, ఆగస్ట్ 26 నుంచి వడ్డీ, ఇతర ఖర్చులు అదనంగా ఉన్నాయి. దీనికి అదనంగా రూ. 786.52 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉందని మంత్రి తెలిపారు.
ఎస్‌బీఐ గతంలో 2020, నవంబర్ 10న కూడా ఆర్‌కామ్ సహా ప్రమోటర్ అనిల్ అంబానీని 'ఫ్రాడ్'గా వర్గీకరించి.. 2021, జనవరి 5న సీబీఐకి ఫిర్యాదు చేసింది. అయితే.. ఆ మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టేటస్ కో (యథాస్థితి కొనసాగించమని) ఆదేశాలు ఇవ్వగా.. ఫిర్యాదును సీబీఐ వెనక్కి పంపింది. ఆ తర్వాత.. 2023, మార్చి 27న సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. దీని ప్రకారం.. అప్పు తీసుకున్న వారి ఖాతాను 'ఫ్రాడ్'గా ప్రకటించే ముందు.. వారికి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. ఈ తీర్పు ఆధారంగా, ఎస్‌బీఐ 2023, సెప్టెంబర్ 2న 'ఫ్రాడ్' వర్గీకరణను తాత్కాలికంగా వెనక్కి తీసుకుంది.మళ్లీ ఆర్బీఐ 2024, జులై 15న జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. అన్ని ప్రక్రియలను మళ్లీ అనుసరించి, తగిన పరిశీలనల తర్వాత, ఎస్‌బీఐ ఇప్పుడు ఆర్‌కామ్, అనిల్ అంబానీలను తిరిగి 'ఫ్రాడ్'గా వర్గీకరించింది.
Also Read: Bangladesh: ఎయిర్ క్రాష్ బాధితుల కోసం ముందుకు వచ్చిన భారత్..ఢాకాకు స్పెషల్ టీమ్