Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు దక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని 26 రైళ్లను ప్రత్యేకంగా నడపనుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. By Kusuma 15 Nov 2024 in నేషనల్ లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుకలు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ఈ రోజు నుంచి మండల మకరు విళక్కు పూజ ప్రారంభం కానుంది. అయ్యప్ప మాల వేసిన భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ప్రయాణికులకు మరింత సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే మొత్తం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, మౌలాలి, కొట్టాయం, కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇది కూడా చూడండి: మళ్లీ పెళ్లి చేసుకోనున్న జెఫ్ బెజోస్.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా? మెరుగైన సేవలు అందించేందుకు.. ఇదిలా ఉండగా.. కేరళ ప్రభుత్వం ఇటీవల స్వామి అనే చాట్‌బాట్‌ను కూడా విడుదల చేసింది.శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వామి పేరుతో కొత్త చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వామి చాట్‌బాట్ లోగోను ఆవిష్కరించారు. ఇది కూడా చూడండి: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. రిలేషన్‌షిప్‌లో ముద్దులు, హగ్‌లు సహజమే ఈ చాట్‌బాట్‌ను ముత్తూట్ గ్రూప్ సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించింది. శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో మీకు కావాల్సిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో అన్ని వివరాలు భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్‌బాట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఇది కూడా చూడండి: Gold Price Today: మహిళలకు బంపరాఫర్.. భారీగా తగ్గిన పసిడి ధరలు శబరిమలలో పూజా సమయం, దర్శన సమయాలు ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు విమానాలు, రైళ్లు, స్థానిక వివరాలు, పోలీసులు, అటవీ శాఖ వివరాలు కూడా ఈ స్వామి చాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. యాత్ర ప్రారంభం కావడంతో ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇది కూడా చూడండి: మహిళలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు విడుదల! #sabarimala #ayyappa-devotees #special-trains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి